Shani Uday In Kumbh 2023:  గ్రహాలు నిర్ధిష్ట సమయం తర్వాత సంచరించడం, తిరోగమనం చెందడం, ఉదయించడం లేదా అస్తమించడం చేస్తాయి. మార్చి 09న శనిదేవుడు కుంభరాశిలో ఉదయించాడు. దీని వల్ల శష మహాపురుష రాజయోగం ఏర్పడనుంది. ఈరాజయోగం అన్ని రాశులవారిని ప్రభావితం చేస్తుంది. శనిదేవుడి యెుక్క ఈ సంచారం కారణంగా మూడు రాశులవారు కెరీర్ లో పురోగతితోపాటు అపారమైన సంపదను పొందుతారు. ఈ అదృష్ట రాశులు ఏంటో తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రాజయోగం ఈ రాశులకు శుభప్రదం


కుంభం (Aquarius)
శష్ మహాపురుష రాజయోగం ఏర్పడటంతో కుంభ రాశి వారికి మంచి రోజులు మొదలవుతాయి. ఎందుకంటే మీ రాశి యెుక్క లగ్నస్థ గృహంలో ఈ యోగం ఏర్పడుతోంది. దీంతో మీకు మీ లైఫ్ పార్టనర్ సపోర్టు లభిస్తుంది. మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వ్యాపారంలో పెద్ద పెద్ద ఒప్పందాలు కుదుర్చుకుంటారు. మీ కెరీర్ లో పురోగతి ఉంటుంది. పెళ్లికాని యువతీయువకులకు వివాహం కుదిరే అవకాశం ఉంది. 


మేష రాశిచక్రం (Aries)
మేష రాశి వారికి శని దేవుడి పెరుగుదల ఆర్థికంగా శుభప్రదంగా ఉంటుంది. ఎందుకంటే మీ సంచార జాతకంలో శనిదేవుడు 11వ ఇంట్లో ఉదయించాడు. దీంతో మీ ఆదాయంలో రెట్టింపు పెరుగుదల ఉంటుంది. మీకు ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. మీ శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. పెట్టుబడి ద్వారా ప్రయోజనం పొందుతారు. 


సింహ రాశి (Leo)
మీకు శష్ మహాపురుష్ రాజయోగం సింహరాశివారికి చాలా మేలు చేస్తుంది. మీ దాంపత్య జీవితం అద్భుతంగా ఉంటుంది. పార్టనర్ షిప్  తో చేసే పనుల్లో మీకు విజయం దక్కుతుంది. వివాహం కాని వారికి పెళ్లి కుదిరే అవకాశం ఉంది. ఉద్యోగులకు పదోన్నతి లభించే అవకాశం ఉంది. ఆఫీసులో మీరు అదనపు బాధ్యతను తీసుకుంటారు. ఆగిపోయిన మీ పనులన్నీ పూర్తవుతాయి. 


Also Read: Mangal Surya Gochar: రాశిని మార్చబోతున్న అంగారకుడు-సూర్యుడు.. ఈ రాశులకు తిరుగులేదు ఇక..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


 TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి