Shani Gochar 2023: ఆస్ట్రాలజీ ప్రకారం, అత్యంత నెమ్మెదిగా కదిలే గ్రహాల్లో శని ఒకటి. ఒక రాశి నుండి మరొక రాశికి వెళ్లడానికి శనిదేవుడి రెండున్నర సంవత్సరాలు పడుతుంది. ప్రస్తుతం శనిగ్రహం మకరరాశిలో సంచరిస్తోంది. వచ్చే ఏడాది ప్రారంభంలో అంటే జనవరి 17, 2023, రాత్రి 8:02 గంటలకు శనిదేవుడు కుంభరాశిలోకి ప్రవేశించనున్నాడు. 30 ఏళ్ల తర్వాత కుంభరాశిలోకి శని వెళ్లనున్నాడు. ఇతడి సంచారం వల్ల శష్ మహాపురుష రాజయోగం ఏర్పడుతుంది. ఈ యోగాన్ని జ్యోతిష్యశాస్త్రంలో పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ రాజయోగం వల్ల ఐదు రాశులవారికి ఎంతో మేలు జరుగుతుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మేషం (Aries): మేష రాశి వారు షష్ రాజయోగం వల్ల చాలా ప్రయోజనం పొందుతారు. ఈరాశివారి ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. మీకు అదృష్టం కలిసి వచ్చి ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. మీరు ఉద్యోగ, వ్యాపారాల్లో అపారమైన పురోగతిని సాధిస్తారు. కుటుంబంలో శాంతి నెలకొంటుంది. 
వృషభం (Taurus): శనిదేవుడి రాశి మార్పు వృషభ రాశి వారికి బాగుంటుంది. శని అనుగ్రహంతో ఈ రాశి వారు అన్ని పనులను సకాలంలో పూర్తిచేస్తారు. ఉద్యోగంలో పురోభివృద్ధి, ధనలాభం ఉంటుంది. ఇంట్లో మరియు కుటుంబంలో శాంతి మరియు శ్రేయస్సు నెలకొంటుంది. 
కన్య (Virgo): షష్ రాజయోగం వల్ల కన్యా రాశి వారి జీవితాల్లో పెను మార్పులు రానున్నాయి. కుటుంబం మరియు జీవితంలో ఆనందం నెలకొంటుంది. కోర్టు తీర్పుల్లో మీరు విజయం సాధిస్తారు. అన్ని రకాల వివాదాలు పరిష్కరించబడతాయి. 


మకరరాశి (Capricorn): శని సంచారం వల్ల మకర రాశి వారు కెరీర్‌లో గొప్ప విజయాన్ని సాధిస్తారు. వ్యాపారస్తులు భారీగా లాభపడతారు. లక్ కలిసి వస్తుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ధనలాభం ఉంటుంది. మీరు ఆర్థిక సంక్షోభం నుండి బయటపడతారు. 
కుంభ రాశి (Aquarius): కుంభంలో షష్ రాజయోగాన్ని సృష్టిస్తున్నారు.  ఈరాశులవారు గరిష్ట ప్రయోజనం పొందుతారు. మీరు పాత వివాదాల నుండి బయటపడతారు. న్యాయపరమైన అంశాలు పరిష్కరించబడతాయి. భాగస్వామ్యంతో చేసిన పనుల్లో భారీగా లాభాలు ఉంటాయి.  


Also Read: Budh Gochar 2022: డిసెంబర్ చివరిలో బుధుడు గమనంలో పెను మార్పు.. ఈ 4 రాశుల వారి ఇల్లు డబ్బుతో నిండటం ఖాయం..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook