Budh Gochar 2022: ప్రతి నెలా వివిధ గ్రహాలు తమ కదలికలను మార్చుకుంటూ ఉంటాయి. మెర్క్యురీని గ్రహాల యువరాజు అని పిలుస్తారు. అంతేకాకుండా బుధుడిని జ్ఞాన ప్రదాత అని కూడా అంటారు. బుధుడు ప్రస్తుతం ధనుస్సు రాశిలో సంచరిస్తున్నాడు. అతను 25 రోజుల పాటు ఇక్కడ ఉండి 28 డిసెంబర్ 2022న మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. రెండు రోజుల అనంతరం బుధుడు డిసెంబర్ 30న అదే రాశిలో తిరోగమనం చేయనున్నాడు. బుధుని యెుక్క ఈ అనుగ్రహం వల్ల ఈ నాలుగు రాశులవారి అదృష్టం మారిపోనుంది.
మేషం (Aries): మేష రాశి వారికి బుధుడు రాశి మారడం వల్ల ఎంతో మేలు జరుగుతుంది. ఈ ఏడాది చివరిలో బుధుడి సంచారం మరియు తిరోగమనం మేషరాశి వారికి చాలా ప్రయోజనాలను ఇస్తుంది. కెరీర్లో అద్భుతమైన పురోగతి సాధిస్తారు. వ్యాపారవేత్తలు చాలా లాభాలను పొందుతారు. సంపద రెట్టింపు అవుతుంది. మెుత్తానికి ఈ సమయం మీకు కలిసి వస్తుంది.
వృషభం (Taurus): మెర్క్యూరీ సంచారం మరియు తిరోగమన బుధుడు వృషభ రాశి వారికి అనుకూలమైన ఫలితాలను ఇస్తాడు. పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తవుతాయి. ఉద్యోగం మారాలనే ఆలోచనలో ఉన్న వారి కోరిక నెరవేరుతుంది. ఉద్యోగులకు పదోన్నతి లభిస్తుంది. మీకు జీతంలో పెరుగుదల ఉంటుంది. మీ బిజినెస్ విస్తరిస్తుంది.
సింహం (Leo): సింహ రాశి వారికి బుధుడు రాశి మార్పు చాలా శుభప్రదంగా ఉంటుంది. కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి. వ్యాపారులు రెట్టింపు లాభాలు పొందుతారు. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. విద్యార్థులకు ఈ సమయం కలిసి వస్తుంది. మీ వైవాహిక జీవితం అద్భుతంగా ఉంటుంది. మీరు ఊహించనంత ధనాన్ని పొందుతారు.
కన్య (Virgo): బుధుని అనుగ్రహంతో కన్యా రాశి వారు కోరికలు నెరవేరుతాయి. మీరు ఏదైనా వాహనం లేదా ఇల్లు కొనుగోలు చేసే అవకాశం ఉంది. మీ అదృష్టం కలిసి వస్తుంది. మీ ఇల్లు డబ్బుతో నిండిపోతుంది. ఆస్తిపై పెట్టుబడి పెట్టడం ద్వారా మీరు లాభాలను పొందుతారు. వ్యాపారులు, ఉద్యోగులు లాభపడతారు. పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి.
Also Read: Shani Gochar 2023: 30 ఏళ్ల తర్వాత శని గమనంలో పెను మార్పు... ఈ 4 రాశులవారు పట్టిందల్లా బంగారమే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook.