Shani Dev: 2024 వరకు ఈ 3 రాశులకు లక్కే లక్కు.. డబ్బే డబ్బు.. మీ రాశి ఉందా?
Saturn transit 2023: ఆస్ట్రాలజీలో శనిదేవుడిని న్యాయదేవుడు, కర్మదాతగా పిలుస్తారు. దీపావళికి ముందు ఈ మూడు రాశుల అదృష్టం మారనుంది. శనిదేవుడి సంచారం ఏ రాశులవారికి అనుకూలంగా ఉండనుందో తెలుసుకుందాం.
Shani Grah transit 2023: అన్ని గ్రహాలలోకెల్లా నెమ్మదిగా కదిలే గ్రహం శని. సాధారణంగా శనిదేవుడు రెండున్నర సంవత్సరాలకు ఒకసారి తన రాశిని మారుస్తాడు. 30 ఏళ్ల తర్వాత శని గ్రహం ప్రస్తుతం కుంభరాశిలో సంచరిస్తున్నాడు. రివర్స్ లో కదులుతున్న శనిదేవుడు నవంబరు 04 వరకు అదే స్థితిలో ఉంటాడు. ఆ తర్వాత నేరుగా నడవనున్నాడు. శని సంచార ప్రభావం ప్రజలందరిపై కనిపిస్తుంది. మీ జాతకంలో శనిదేవుడు శుభ స్థానంలో ఉంటే మీకు దేనికీ లోటు ఉండదు. శని సంచారం వల్ల ఏయే రాశులవారు ప్రయోజనం పొందనున్నారో తెలుసుకుందాం.
తులారాశి
శని గ్రహ సంచారం తులరాశివారికి ఊహించని లాభాలను ఇస్తుంది. మీకు ఆకస్మికంగా ధనం అందుతుంది. మీ కెరీర్‌లో ఎదుగుదల ఉంటుంది. ఉద్యోగులకు జీతం పెరగడంతోపాటు ప్రమోషన్ కూడా లభిస్తుంది. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. మీ జీవితంలో ఆనందం వెల్లివిరిస్తుది.
వృషభం
కుంభరాశిలో శనిదేవుడి సంచారం వృషభరాశి వారికి చాలా మేలు చేస్తుంది. మీరు ఉద్యోగ, వ్యాపారాల్లో ప్రయోజనం పొందనున్నారు. జాబ్ కోస ప్రయత్నించే వారికి కోరిక నెరవేరుతుంది. బిజినెస్ చేసేవారు భారీగా లాభపడతారు. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి.
మిధునరాశి
శనిదేవుడి గమనంలో మార్పు మిథునరాశి వారికి అనుకూలంగా ఉంటుంది. మీ శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. కోర్టు కేసుల్లో విజయం సాధిస్తారు. ఉద్యోగులకు కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. ఈ సమయంలో మీరు తీసుకున్న నిర్ణయాలు మంచి ఫలితాలను ఇస్తాయి.
Also Read: Guru Gochar 2023: అమల రాజయోగంతో మారనున్న ఈ 3 రాశుల ఫేట్... ఇందులో మీ రాశి ఉందా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook