Shani Dev: శని సాడే సాతి నుంచి అన్ని రాశువారు ఇలా సులభంగా ఉపశమనం పొందవచ్చు..
Shani Gochar 2022: శని దేవుని ప్రభావంతో మనిషి జీవితంలో చాలా రకాల మార్పులు సంభవించే అవకాశాలున్నాయి. ముఖ్యంగా చెడు ప్రభావవం వల్ల అన్ని రాశువారు తీవ్ర ఇబ్బందుల పాలవుతారు. అయితే చెడు ప్రభావం నుంచి ఎలా ఉపశనం పొందాలో ఇప్పుడు తెలుసుకుందాం..
Shani Gochar 2022: శనిదేవుని న్యాయ గురువుగా కూడా పిలుస్తారు. మనిషి జీవితంలో చేసే కర్మలను బట్టి శని దేవుడు ఫలితాలు ఇస్తాడని జ్యోతిష్య శాస్త్రంలో పేర్కొన్నారు. అంతేకాకుండా శని దేవుడి శుభ ఫలితాల వల్ల జీవితంలో ఉన్నత శిఖరాలకు ఎదిగే అవకాశాలు కూడా ఉన్నాయి. మీ జీవితంలో మీరు చెడు కర్మ ఫలితాలకు అలవాటు పడితే శని దేవుడి ప్రభావంతో సంపద, చదువు, వివాహం, దాంపత్య జీవితంపై దుష్ప్రభావాలు కలిగే అవకాశాలున్నాయి.
శని దేవుని న్యాయదేవతగా ఎందుకంటే మనం జీవితంలో చేసే ప్రతి ఒక్క కర్మను ఆయన చూస్తూ.. గమనిస్తూ ఉంటాడు. ఇలా గమనించి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫలితాన్ని కట్టబెడుతూ ఉంటాడు. చెడు కర్మలు చేసేవారికి దుష్ప్రభావాలను కలిగించి మంచి కర్మలను చేసే వారికి మంచి ప్రయోజనాలు చేకూరుస్తాడు. అందుకే శని దేవుని జ్యోతిష్య శాస్త్రంలో రారాజు కూడా అంటారు. శని దుష్ప్రభావాలు ఉన్నవారు ఎలాంటి నియమాలు పాటిస్తే సులభంగా ఉపశమనం పొందుతారో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
1. శని సాడే సాతితో బాధపడుతున్న వారు తప్పకుండా జ్యోతిష్య శాస్త్రంలో పేర్కొన్న పలు చిట్కాలను పాటించాల్సి ఉంటుంది. ముఖ్యంగా వీరు తీపి పదార్థాలను ఎక్కువగా ఇతరులకు దానం చేయాల్సి ఉంటుంది.
2. పేదవారికి తీపి పదార్థాలను దానం చేయడం వల్ల జీవితంలో శని దుష్ప్రభావాలు తొలగిపోయి. మంచి ప్రయోజనాలు కలిగే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్య శాస్త్రంలో పేర్కొనబడింది.
3. శని చెడు ప్రభావంతో బాధపడుతున్న వారు తప్పకుండా వీరు పూరి పప్పును పేదవారికి దానం చేయాల్సింది. ఇలా ప్రతి శనివారం దానం చేయడం వల్ల మంచి ప్రయోజనాలు పొందుతారు.
4. ముఖ్యంగా ఉసిరి చెట్టు ముందు దీపాన్ని వెలిగించి ంచి శని మంత్రాన్ని పఠించాల్సి ఉంటుంది. ఇలా ప్రతి శనివారం చేస్తే శని చెడు ప్రభావం తొలగిపోతుంది.
5. శని దేవుడి చెడు ప్రభావంతో బాధపడుతున్న వారు ఇనుముతో చేసిన ఉంగరాలను చేతివేళ్ళకు ధరించాల్సి ఉంటుంది. ఇలా ధరిస్తే అన్ని శుభాలే కలుగుతాయని జ్యోతిషంలో పేర్కొన్నారు.
Also Read : Watch Now: కాటేసే నాగరాజుకే కిస్ ఇచ్చిన బలరాజు..నెట్టింట తెగ చెక్కర్లు కొడుతున్న వైరల్ వీడియో..
Also Read : Rhino In Football Ground: ఫుట్‌బాల్ గ్రౌండ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఖడ్గమృగం.. ఆటగాళ్లు ఏం చేశారో చూడండి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook