Shani Gochar 2023: శని గోచారంతో శశ మహాపురుష రాజయోగం, ఆ 4 రాశులకు మహర్ధశ వద్దంటే డబ్బు
Shani Gochar 2023: హిందూ పంచాంగం ప్రకారం ప్రతి గ్రహానికి ఓ విశిష్టత ఉంది. అదే విధంగా ప్రతి గ్రహం నిర్ణీత సమయంలో నిర్దేశిత రాశిలో ప్రవేశిస్తుంటుంది. ఇదే గ్రహాల గోచారం లేదా రాశి పరివర్తనంగా పరిగణిస్తారు. శని గ్రహం గోచారం గురించి తెలుసుకుందాం..
Shani Gochar 2023: గ్రహాల్లో శని గ్రహం పేరు వినగానే ప్రతి ఒక్కరికీ భయం పుడుతుంటుంది. కారణం హిందూమతం ప్రకారం శనిగ్రహం అంటే చేసిన కర్మలకు తక్షణం ప్రతిఫలాన్నిచ్చే న్యాయదేవత. అలాంటి శనిగ్రహం గోచారంతో ఏర్పడనున్న దుర్లభ రాజయోగం కారణంగా ఆ 4 రాశులవారికి కలలో కూడా ఊహించని తట్టుకోలేనంతగా డబ్బు వచ్చి పడుతుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
హిందూ జ్యోతిష్యశాస్త్రం ప్రకారం శశయోగం అనేది పంచ మహపురుష యోగాల్లో ఒకటి. శని ఎవరి జాతకం కుండలిలో అయినా చంద్రుడు లేదా లగ్నం నుంచి కేంద్రంలో కూర్చుని ఉంటే లేదా చంద్రుడు లేదా లగ్నం నుంచి 1, 4, 7, 10 పాదాల్లో కుంభం, తుల, మకర రాశుల్లో ఉంటే ఈ అద్భుతమైన యోగం ఏర్పడుతుంటుంది. శనిగ్రహం అనేది అత్యంత నెమ్మదిగా నడిచే గ్రహం. శనిగ్రహం ఒక్కొక్క రాశిలో రెండున్నరేళ్లపాటు ఉంటాడు. ప్రస్తుతం శనిగ్రహం తన సొంతరాశి కుంభంలో ఉన్నాడు. 2025 వరకూ ఇదే రాశిలో విరాజిల్లనున్నాడు. శని గోచారం కారణంగా శశ మహాపురుష యోగం ఏర్పడనుంది. ఈ రాజయోగం కారణంగా నాలుగు రాశులకు ఊహించని రీతిలో డబ్బులు పడుతూనే ఉంటాయి.
శని గోచారం కుండలి 6వ భాగంలో ఉంటే శశ మహా పురుష యోగం ఏర్పడుతుంది. ఈ ప్రభావంతో కన్యా రాశికి చెందిన వ్యాపారులకు అద్భుతంగా ఉంటుంది. ఉద్యోగులకు అంతా కలిసొస్తుంది. ఉద్యోగంలో పదోన్నతి, ఇంక్రిమెంట్లు లభిస్తాయి. వ్యాపారులు ఊహించని లాభాలు ఆర్జిస్తారు. మీ సాహసం కీలకమైన సవాళ్లను దాటేస్తుంది. పనిచేసే చోట కీర్తి ప్రతిష్ఠలు లభిస్తాయి.
ప్రస్తుతం శని కుంభరాశిలోనే ఉన్నాడు. మరో రెండేళ్లు అంటే 2025 వరకూ ఇందులో ఉంటాడు. శశ మహా పురుష యోగం ఏర్పడటం కుంభరాశి జాతకులకు చాలా ప్రత్యేకం కానుంది. ఉద్యోగులకు, వ్యాపారులకు చాలా అనువైన సమయంగా చెప్పవచ్చు. ఉద్యోగులకు పదోన్నతి, ఇంక్రిమెంట్లు లభిస్తే వ్యాపారులకు ఊహించని లాభాలు కలుగుతాయి. ఆర్దికంగా పటిష్టమైన స్థితిలో ఉంటారు. చేసిన పెట్టుబడులు లాభాన్నిస్తాయి.
మేష రాశి జాతకుల జీవితంలో ఊహించని శుభవార్తలు వింటారు. ఈ రాశివారి ప్రతి రంగంలో విజయం సిద్ధిస్తుంది. కనకవర్షం ఊహించని విధంగా కురుస్తుంటుంది. పెండింగులో ఉన్న అన్ని పనులు పూర్తవుతాయి. ఆర్దికంగా చాలా మంచి స్థితిలో ఉంటారు. ఆదాయానికి కొత్త మార్గాలు తెల్చుకుంటాయి.
వృషభ రాశి జాతకులకు శశ మహాపురుష రాజయోగం ప్రభావంతో భవిష్యత్ అంతా ఊహించని రీతిలో కనకవర్షంలో మునిగితేలుతారు. ఉద్యోగ, వ్యాపారాల్లో చాలా బాగుంటుంది. ఆదాయానికి కొత్త మార్గాలు తెర్చుకుంటాయి. పాత డబ్బులు అన్నీ తిరిగొస్తాయి. మీరు ఊహించని రీతిలో మీరు తట్టుకోలేనంతగా డబ్బులు వచ్చి పడతాయి. ఆర్ధికంగా బలమైన స్థితిలో ఉంటారు.
Also read: jyeshtha amavasya 2023: ఈ నెల జ్యేష్ఠ అమావాస్య ప్రత్యేక ప్రాముఖ్యత, ఇలా చేసేవారికి లాభాలే లాభాలు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook