jyeshtha amavasya 2023: ఈ నెల జ్యేష్ఠ అమావాస్య ప్రత్యేక ప్రాముఖ్యత, ఇలా చేసేవారికి లాభాలే లాభాలు!

jyeshtha amavasya 2023: ఈ నెలలో వచ్చే జ్యేష్ఠ అమావాస్య ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. అంతేకాకుండా శోభన యోగ సమయంలో దానం చేయడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : May 18, 2023, 04:59 PM IST
 jyeshtha amavasya 2023: ఈ నెల జ్యేష్ఠ అమావాస్య ప్రత్యేక ప్రాముఖ్యత, ఇలా చేసేవారికి లాభాలే లాభాలు!

Jyeshtha Amavasya 2023: ప్రతి నెలలో అమావాస్యకు ప్రత్యేక ప్రాముఖ్య ఉంది. ముఖ్యంగా హిందూ సాంప్రదాయంలో జ్యేష్ఠ అమావాస్యకు ప్రత్యేక ప్రాముఖ్య ఉంది. సోమ, మంగళ, శుక్ర, గురువారాల్లో ఈ అమావాస్య వస్తే చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అయితే ఈ నెలలో జ్యేష్ఠ అమావాస్య మే 19 శుక్రవారం వస్తోంది. అంతేకాకుండా ఇదే రోజు వటసావిత్రీ వ్రతాన్ని కూడా పాటిస్తున్నారు. కాబట్టి ఈ అమావాస్య ప్రత్యేక ప్రాముఖ్య ఉందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా ఈ రోజు పూర్వీకుల ఆత్మకు శాంతి కలగాలనుకుంటే దానం చేసి, తర్పణం సమర్పించడం వల్ల మంచి లాభాలు కలుగుతాయి. ఇలా దాన, ధర్మ కార్యక్రమాలు చేయడం వల్ల సంపద, సంతానం కలుగుతుందని నిపుణులు కూడా తెలుపుతున్నారు. 

జ్యేష్ఠ అమావాస్య తిథి, సమయాలు:
పంచాంగంలోని జ్యేష్ఠ అమావాస్య తిథి మే 18 రాత్రి 9.42 గంటలకు ప్రారంభమై మే 19 రాత్రి 9.22 గంటలకు ముగుస్తుంది.

స్నానాన్ని ఆచరించే సమయం: ఉదయం 05.15 నుంచి 04.59 వరకు
శని దేవుడి పూజ ముహూర్తం: సాయంత్రం 06.42 నుంచి రాత్రి 07.03 వరకు

జ్యేష్ఠ అమావాస్య 2023 శుభ యోగం:
ఈ నెలలో వచ్చే జ్యేష్ఠ అమావాస్య చాలా విశిష్టమైనదని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఎందుకంటే 30 సంవత్సరాల తర్వాత జ్యేష్ఠ అమావాస్య రోజున శోభన యోగం ఏర్పడుతోంది. కాబట్టి ఈ క్రమంలో శని దేవుడికి పూజా కార్యక్రమాలు చేయడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా జీవితంలో సమస్యలు కూడా సులభంగా దూరమవుతాయి. 

శోభన యోగ సమయం: సాయంత్రం 18 మే ప్రారంభమై.. సాయంత్రం 19:37 వరకు ఉంటుంది.

జ్యేష్ఠ అమావాస్య రోజు ఇలా చేయండి:
ఇంట్లో సంతోషం, శాంతి కోసం:

జ్యేష్ఠ అమావాస్య రోజు ఉదయాన్నే గంగా నదిలో స్నానం చేస్తే పాపాలు తొలగిపోతాయి. అంతేకాకుండా చనిపోయిన వారి ఆత్మ కూడా శాంతిస్తుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. నిలిపోయిన పనులు కూడా సులభంగా నెరవేరుతాయి.

సంపద పెరుగుతుంది:
అమావాస్య నాడు పూర్వీకులు ఏ రూపంలోనైనా భూమికి వస్తారని, వీరిని ఆనంద పరచడానికి బ్రాహ్మణులకు దానం చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఈ క్రమంలో ఒత్తడి సమస్యలు కూడా దూరమవుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. 

Also Read: MI vs GT Dream11 Team Prediction: గుజరాత్‌పై ముంబై ప్రతీకారం తీర్చుకుంటుందా..? పిచ్ రిపోర్ట్.. డ్రీమ్ 11 టీమ్ టిప్స్ ఇలా..!  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News