Saturn Transit 2023: గ్రహాల గమనం ఎప్పుడు మారుతుందో ఎవరూ చెప్పలేం. ఎవరికి మంచి రోజులు వస్తాయో, ఎవరికి చెడు రోజులు దాపురిస్తాయో గ్రహాల స్థానం ప్రకారం పంచాంగ కర్తలు నిర్ణయిస్తారు. ఆస్ట్రాలజీ ప్రకారం, శనిదేవుడు జనవరి 31న కుంభరాశిలో అస్తమిస్తున్నాడు. తిరిగి మార్చి 5న అతడు ఉదయిస్తాడు. అంటే అంటే శనిదేవుడు తన మూల త్రిభుజ రాశిలో 33 రోజుల పాటు బలహీన స్థితిలో ఉంటాడు. దీంతో మీరు మానసికంగా ఒత్తిడికి గురవుతారు. త్వరలో ఈ రాశిలోకి సూర్యుడు, బుధుడు ప్రవేశించనున్నారు.  శనిదేవుడి అస్తమయం వల్ల ఏ రాశులవారికి చెడ్డ రోజులు మెుదలుకానున్నాయో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మేషం: మేషరాశి వ్యక్తుల జాతకంలో శని 10వ ఇంట్లో అస్తమిస్తుంది. అస్తమించడం వల్ల జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. వృత్తి జీవితంలో అలజడి ఉంటుంది. ఆర్థికంగా మీరు నష్టపోయే అవకాశం ఉంది. ఈ సమయంలో మీరు పెట్టుబడి పెట్టకుండా ఉంటేనే మంచిది. వైవాహిక జీవితంలో సమస్యలు ఉంటాయి. శనివారం పండ్లను దానం చేయడం మీకు శుభప్రదంగా ఉంటుంది. 
కర్కాటకం: కర్కాటక రాశి వారికి వచ్చే 33 రోజులు బాధాకరంగా ఉంటాయి. కెరీర్‌కు సంబంధించి ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకోకుండా ఉంటే మంచిది. జీవిత భాగస్వామితో విభేదాలు రావచ్చు. ఈ సమయంలో ఏ పనిని ప్రారంభించకపోవడం మంచిది. శనివారం సుందరకాండ పఠించి హనుమంతుని పూజించడం వల్ల మీకు మేలు జరుగుతుంది. 
సింహం: మీ జాతకంలోని ఆరవ ఇంట్లో శని అస్తమిస్తుంది. దీంతో మీ ఆరోగ్యం క్షీణిస్తుంది. ఇప్పటికే రోగాల బారిన పడుతున్న వారికి మరిన్ని సమస్యలు ఎదురవుతాయి. మీరు వాటికే ఎక్కువగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ సమయంలో మీరు చెడ్డ వార్తలు వినే అవకాసం ఉంది. శనివారం ఉపవాసం ఉండి శని దేవుడిని పూజించండి.


వృశ్చికం: ఈ 33 రోజులు పెద్దగా పెట్టుబడి పెట్టకండి. వ్యాపారంలో కొత్త ప్రయోగాలకు దూరంగా ఉండండి. డబ్బును తెలివిగా ఉపయోగించండి. వ్యాపార దృష్ట్యా మీరు తక్కువ దూరం ప్రయాణించవలసి ఉంటుంది. ఈ ప్రయాణంలో ప్రత్యేక శ్రద్ధ వహించండి. కుటుంబ సభ్యులతో అనవసర వాదనలకు దిగకండి. శనివారం పీపల్ చెట్టు కింద ఆవనూనె దీపం వెలిగించండి.
కుంభం: కుంభ రాశి వారు ఈ 33 రోజులు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఈ రాశిలో శనిదేవుడు అస్తమిస్తున్నాడు. మీరు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవలసి ఉంటుంది. ఉద్యోగం చేసే వారు ఆఫీసులో అధికారుల నుండి ఒత్తిడిని ఎదుర్కోవలసి రావచ్చు. మీ జీవిత భాగస్వామితో గొడవలు వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగం మారే ముందు చాలా సార్లు ఆలోచించండి. కెరీర్ సంబంధిత నిర్ణయాలు తీసుకోవడంలో తెలివిగా వ్యవహారించండి. వ్యాపారస్తులు ఎలాంటి పెట్టుబడులు పెట్టకూడదు. శనివారం ఉరద్ పప్పును దానం చేయండి.


Also Read: Nagoba Jatara 2023: అడవి బిడ్డల పండగ చూద్దాం రండి.. నేటి నుంచే నాగోబా జాతర ప్రారంభం..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook