Nagoba Jatara 2023: ప్రపంచంలో అతిపెద్ద జాతర్లలో నాగోబా జాతర, సమ్మక్క సారక్క జాతరలే ముందుంటాయి. పూర్వం ఆదివాసి గిరిజనులు జరుపుకునే ఇవి రెండు పండగలు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రాముఖ్యత పొందాయి. ముఖ్యంగా నాగోబా జాతర విషయానికొస్తే.. పది రోజులపాటు జరుపుకునే ఈ జాతరలో గోండు గిరిజనలు, ఆదివాసులంతా భక్తిశ్రద్ధలతో నాగోబాకు పూజలు నిర్వహిస్తారు. ఈ పండగ అమావాస్య రోజు ప్రారంభమవుతుంది. అయితే గుండు గిరిజనులంతా సర్పజాతిని ఎందుకు పూజిస్తారో..? ఈ జాతరను ఘనంగా జరుపుకోవడానికి కారణాలేంటో.? ఈ జాతర విశిష్టత ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
ఆదిలాబాద్ కు 40 కిలోమీటర్ల దగ్గర్లో ఇంద్రవెల్లి మండలం ఉంటుంది.. అదే మండలానికి చెందిన కేస్లాపూర్ అనే గ్రామంలో నాగోబా దేవాలయం ఉంది. ఆ గ్రామంలో కేవలం 400 కంటే తక్కువ మంది గిరిజనులే జీవిస్తారు. కానీ జాతర సందర్భంగా ఆ గ్రామానికి ఇతర రాష్ట్రాల నుంచి లక్షలాదిమంది తరలివస్తారు. పుష్య మాస అమావాస్య రోజున ప్రారంభమయ్యే ఈ నాగోబా జాతరను సందర్శించి నాగోబాను పూజిస్తే జీవితంలో అన్ని రకాల సమస్యలు దూరమై.. పంటలు బాగా పండి రోగాల నుంచి, తీవ్ర అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందని గిరిజనుల నమ్మకం. అందుకే నాగోబా జాతరను గిరిజనులంతా ఉమ్మడిగా ఎంతో ఘనంగా జరుపుకుంటారు.
మెస్రం కుటుంబీకులే ఎందుకు ఈ జాతరను చేస్తారు.?
పూర్వం నుంచి నాగోబా చరిత్రను గోండు ప్రజలంతా పలు రకాలుగా చెప్పుకుంటారు. పూర్వకాలంలో నాగేంద్రుడు మెస్రం కుటుంబానికి చెందిన నాగాయిమోతి కలలోకి వచ్చి.. ఆమె కడుపులో బిడ్డగా సాక్ష్యాత్తు నాగసర్పమే జన్మిస్తుందని వారు చెబుకుంటారు. ఇదే కాకుండా ఒక్కొక్కరు ఒక్కొక్క కథగా చెప్పుకుంటారు. అందుకే వివిధ రాష్ట్రాల్లో ఉన్న మెస్రం వంశానికి చెందిన 22 తెగలు ఈ జాతరకి వచ్చి నాగోబాను దర్శించుకుంటారు. నాగోబా దేవాలయాన్ని 1956 లోనే మెస్రం వంశానికి చెందిన కొంతమంది పెద్దలు నిర్మించారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక గిరిజనుల పండుగకు ప్రాధాన్య తెచ్చి ఈ గుడిని శిలలతో దేవాలయంగా నిర్మించారు.
పూజా పద్ధతులు:
పుష్య పౌర్ణమి రోజున నాగోబాకు అభిషేకానికి సంబంధించిన పవిత్రమైన గంగాజలం కోసం.. మెస్రం వంశీయులు వందలాదిమంది కాలినడకన పవిత్ర గోదావరి దగ్గరికి వెళ్లి జలాన్ని సేకరిస్తారు. ఈ జలాన్ని సేకరించే ముందు వారంతా తప్పకుండా నది స్నానాలను ఆచరిస్తారు. ఇలా చేసిన తర్వాత జలాన్ని ఓ రాగి పాత్రలో సేకరించి.. గోండు పుల్ల మధ్య కేస్లాపూర్ గ్రామానికి చేరుకుంటారు. ఇలా తీసుకువచ్చిన గంగాజలాన్ని అమావాస్య రోజున రాత్రి నాగోబాకు అభిషేకం చేస్తారు. దీంతో నాగోబా జాతర ప్రారంభమవుతుంది. అయితే ఇక్కడ దేవుడికి సమర్పించే నైవేద్యం 22 పొయ్యిల మీద మాత్రమే చేయాల్సి ఉంటుంది. ఈ పొయ్యిలన్నీ జాతర ప్రాంగణంలోనే మెస్రం వంశీయులు నిర్మించారు.
Also Read: TSRTC: టీఎస్ఆర్టీసీకి భారీ ఆదాయం.. సంక్రాంతికి బస్సులకు మంచి ఆదరణ
Also Read: Wipro Lays Off: విప్రో ఉద్యోగులకు ఝలక్.. 400 మందికి ఉద్వాసన
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook