Shanidosh prabhav: సాధారణంగా శనిభగవానుడ్ని మందుడు అని అంటారు. ఆయన ఒక రాశి నుంచి మరోకరాశిలోకి ఇతర గ్రహాల కన్న కూడా మెల్లగా సంచరిస్తుంటారు. ముఖ్యంగా శనిదేవుడు కొన్నిసాడేసాతి, ఏలినాటి ప్రభావాలను కల్గజేస్తుంటాడు. అందుకే... ఆకాలంలో మనిషి అనేక రకాల ఇబ్బందులను ఎదుర్కొంటాడు. అయితే.. ముఖ్యంగా శనిశ్వరుడి చెడు ప్రభావం అనేది చేసుకున్న కర్మలను బట్టి ఉంటుందంట.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అదే విధంగా కొత్త ఏడాది మరికొన్ని రోజుల్లోనే స్టార్ట్ అవుతుంది. ఈ క్రమంలో శనీ ప్రభావం అనేది కొన్ని రాశులకు అదిరిపోయే విధంగా వీరి జాతకం మారనుందంట. ఒక రకంగా చెప్పాలంటే .. వీరు కింగ్ మేకర్లుగా మారునున్నారంట. ఆ రాశులు ఏంటో ఇప్పుడు చూద్దాం.


కన్య రాశి ..  


ఈరాశివారు ఇప్పటి వరకు జీవితంలో ఎదుర్కొన్న సమస్యల నుంచి బైటపడతారని చెప్పుకొవచ్చు.విదేశాలకు వెళ్లే సూచనలు కన్పిస్తున్నాయి. సోదరుల మధ్య మరల బంధం ఏర్పడుతుంది. గతంలో ఏర్పడిన గొడవలు సమసిపోతాయి. విందులు ,వినోదాల్లొ పాల్గొంటారు. మీ వల్ల సహాయం పొంది మర్చిపోయిన వరు మరల మీ దగ్గరకు వస్తారు.


తుల రాశి..


ఈరాశివారు రియల్ ఎస్టేట్ రంగంలో రాణిస్తారు. కొత్త ఇల్లు కొనుక్కుంటారు. విదేశాలకు వెళ్లే సూచనలు కన్పిస్తున్నాయి. కోర్టు కేసుల్లో విజయాలు సాధిస్తారు. తండ్రివైపు నుంచి వివాదాల్లో ఉన్న ఆస్తి మీ సొంతమౌతుంది. 


ధనస్సు..


ఈ రాశివారికి ఆకస్మిక ధనలాభం కల్గుతుంది. పెళ్లి సంబంధాలు కుదురుతాయి. స్నేహితులతో కలిసి విహార యాత్రలకు వెళ్లే సూచలను కన్పిస్తున్నాయి. అదే విధంగా మీ వల్ల కొందరికి మేలు జరుగుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.


మీనం..ఈ రాశివారు కొత్త ఏడాదిలో నూతన ఇల్లును, కారును కొనుగోలు చేస్తారంట. ఆరోగ్య పరంగా ఇప్పటి వరకు ఎదుర్కొన్న సమస్యల నుంచి బైటపడతారు. రాదనుకుని వదిలేసిన డబ్బులు మీ సొంతమౌతాయి.  దేవాలయాలను ఎక్కువగా సందర్శిస్తారు.


Read more: Lord Shanidev: కొత్త ఏడాదికి ముందే శనీశ్వరుడి ప్రభంజనం.. ఈ రాశుల వారు ఏనుగు కుంభ స్థలాన్ని కొట్టబోతున్నారు.. మీరున్నారా..?


అదే విధంగా కొత్త ఏడాదిలో శనీగ్రహా బాధలు తొలగడానికి, మరిన్ని అనుకూల ప్రయోజనాలు పొందడానికి ప్రతిరోజు కూడా రావి చెట్టు కింద నెతీ దీపారాధన చేయాలి. నల్ల చీమలకు చక్కెర, బెల్లంపెట్టాలి. రావి ఆకు మీద బియ్యం వేసి దాని మీద.. నెయ్యిదీపం వెలిగించాలి. నల్ల కుక్క, కాకికి ఏదైన ఆహారం పెట్టాలి. ఇలా చేస్తే శనిదోష ప్రభావం నుంచి బైటపడటంతో పాటు.. మంచి యోగాలు కల్గుతాయని పండితులు చెబుతుంటారు. 


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.