COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Shani Margi 2023 Date And Time: జ్యోతిష్య శాస్త్రంలో శని గమనానికి ప్రత్యేక ప్రాముఖ్య ఉంటుంది. ప్రస్తుతం కుంభరాశిలో తిరోగమన స్థితిలో ఉన్న శని నవంబర్‌ 04వ తేదిన ప్రత్యేక్షంగా సంచారం చేయబోతోంది. దీని కారణంగా చాలా రాశులు ప్రభావితమవుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. కర్మలను బట్టి ఫలితాలను అందించే శని ఈ ప్రత్యేక్ష ప్రభావం కారణంగా కొన్ని రాశులవారికి శని శుభకార్యాలు, అశుభ ఫలితాలు అందించే అవకాశాలు ఉన్నాయి. అయితే ప్రత్యేక్ష సంచారం వ్యక్తి గత జాతకాల్లో శుభ స్థానంలో ఉంటే ఊహించని లాభాలు కలుగుతాయి. శని ప్రత్యక్షంగా కదలడం కారణంగా వచ్చే 2024 సంవత్సరం ఏయే రాశుల వారికి అదృష్టం రెట్టింపు అవ్వబోతోందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 


మేష రాశి:
నవంబర్ 4న శని ప్రత్యేక్షంగా సంచారం దిశలోకి వెళ్లడం వల్ల మేష రాశి వారు అనేక శుభవార్తలు వింటారు. దీంతో పాటు ఈ శని ప్రభావం రాబోయే సంవత్సరంపై కూడా ప్రభావం పడుతుంది. దీని కారణంగా మీ వ్యక్తిగత జీవితంలో చాలా రకాల మార్పులు వస్తాయి. అయితే 2024లో మేషరాశి వారికి శనిదేవుడి అనుగ్రహం లభించి శుభ ఫలితాలు కలుగుతాయి. అంతేకాకుండా ఆదాయం కూడా రెట్టింపు అవుతుంది. వీరు ఈ సమయంలో కొత్త అవకాశాలు కూడా పొందుతారు. వీరు ముఖ్యమైన పనుల్లో సులభంగా విజయాలు సాధిస్తారు. ఇక పెట్టుబడులు పెట్టేవారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. అంతేకాకుండా పెట్టుబడిపై మంచి రాబడిని పొందుతారు. ఈ శని ప్రభావం వల్ల ఉద్యోగాలు చేసేవారికి పదోన్నతులు కూడా సులభంగా లభిస్తాయి. అంతేకాకుండా ఉద్యోగార్థులకు కొత్త అవకాశాలు లభిస్తాయి.


Also Read: Vizianagaram Train Accident: విజయనగరం జిల్లాలో ఘోర రైలు ప్రమాదం.. ప్యాసింజర్ రైలును ఢీకొట్టిన రాయగడ ఎక్స్‌ప్రెస్


సింహ రాశి:
2024 సంవత్సరంలో సింహ రాశివారికి అనేక లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా శని దేవుడి అనుగ్రహం లభించి సులభంగా అనుకున్న పనులు చేయగలుగుతారు. అంతేకాకుండా ఈ రాశివారిపై షష రాజ్యయోగ ప్రభావం పడే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. కెరీర్ పురోగతి, అభివృద్ధికి కొత్త అవకాశాలను పొందుతారు. దీంతో పాటు వారసత్వ సంపద కూడా పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగాలు చేసేవారికి పదోన్నతులు కూడా లభిస్తాయి. అంతేకాకుండా మీపై బాధ్యతలు కూడా పెరుగుతాయి. పెళ్లికాని వ్యక్తులు వివాహ ప్రతిపాదనలను పొందే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. ముఖ్యంగా న్యాయపరమైన విషయాల నుంచి సులభంగా విజయాలు పొందుతారు.


మకర రాశి:
గ్రహాల అధిపతి శని గ్రహం ప్రత్యేక్ష కదలిక కారణంగా జీవితంలో ఊహించని ఆర్థిక లాభాలు పొందుతారు. అంతేకాకుండా వీరికి  పూర్వీకుల ఆస్తి కూడా రెట్టింపు అవుతుంది. ఉద్యోగాలు చేసేవారికి లాభదాయకంగా ఉంటుంది. ఈ సమయంలో వ్యాపారాలు చేసేవారికి ఎంతో లాభదాయకంగా ఉంటుంది. అంతేకాకుండా వీరికి ఈ సమయంలో ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. దీని కారణంగా ఎలాంటి పనులైనా సులభంగా చేయగలుగుతారు. దీంతో పాటు వీరు కొత్త సంబంధాలు ప్రారంభించేందుకు కూడా ఇది అనుకూల సమయం.


Also Read: Vizianagaram Train Accident: విజయనగరం జిల్లాలో ఘోర రైలు ప్రమాదం.. ప్యాసింజర్ రైలును ఢీకొట్టిన రాయగడ ఎక్స్‌ప్రెస్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి