Shani Margi 2022: శనిదేవుడు వచ్చే 3 నెలలపాటు ఈ రాశులవారిని ఇబ్బందులకు గురిచేస్తాడు, అందులో మీరున్నారా మరి?
Shani Margi 2022 Effect: శనిదేవుడు అక్టోబరు 23న తిరోగమనం నుండి మార్గంలోకి వచ్చాడు. దీంతో కొన్ని రాశులవారికి కష్టాలు పెరుగుతాయి.
Shani Margi 2022 Effect: మనం చేసే మంచి చెడులను బట్టి ఫలాలను ఇచ్చేవాడు శనిదేవుడు. అందుకే ఇతడిని న్యాయదేవుడు, కర్మదాత అంటారు. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, జూలైలో శనిదేవుడు మకరరాశిలో తిరోగమనం చెందాడు. ఈనెల 23న మార్గంలోకి వచ్చాడు. శని మార్గం (Shani Margi 2022) కారణంగా జనవరి 17, 2023 వరకు ఈ రాశులవారు శని ఆగ్రహానికి గురవుతారు. దీంతో ఈ రాశులవారు కష్టాలు పెరుగుతాయి. శనిగ్రహ కోపాన్ని నివారించడానికి కొన్ని పరిహారాలు చెప్పబడ్డాయి.
శని ప్రత్యక్ష సంచారం ఈ రాశులకు నష్టం
వృశ్చికం (Scorpio): శని మకరరాశిలో ఉండటం వల్ల వృశ్చిక రాశి వారు అనేక ఇబ్బందులు పడతారు. బ్రదర్స్ తో గొడవలు రావచ్చు. కాబట్టి ఈ సమయంలో వారితో వాదించకండి. ఉద్యోగ, వ్యాపారాల్లో మరింత కష్టపడాల్సి ఉంటుంది.
ధనుస్సు (Sagittarius): మీకు ఊహించని ఖర్చులు ఎదురువుతాయి. దీంతో వీరు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవల్సి ఉంటుంది. కుటుంబ జీవితంలో ఒడిదుడుకులు ఉంటాయి. అనారోగ్యం బారిన పడే అవకాశం ఉంది.
కుంభం (Aquarius): శని ప్రత్యక్ష సంచారం వల్ల మీరు ఆర్థికంగా నష్టపోతారు. ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహించకండి. పనిలో సహోద్యోగులతో వాదించకండి.
మకరం (Capricorn): ఈ వ్యక్తులపై శని సడేసతి కొనసాగుతోంది. ఈ వ్యక్తులు మానసిక మరియు శారీరక సమస్యలతో బాధపడవచ్చు. ఖర్చులు కూడా పెరగవచ్చు.
శని పరిహారాలు
>> శనివారం శని ఆలయంలో ఉదయం మరియు సాయంత్రం ఆవాల నూనె సమర్పించండి.
>> నీడను దానం చేయండి. దీని కోసం, కంచు గిన్నెలో ఆవాల నూనె పోసి, అందులో మీ ముఖాన్ని చూసి, ఆ గిన్నెతో పాటు నూనెను పేదవారికి దానం చేయండి లేదా శని ఆలయంలో ఉంచండి.
>> ప్రతి శనివారం రావిచెట్టుకు ప్రదక్షిణలు చేసి, చెట్టుకింద ఆవాలనూనె దీపం వెలిగించాలి.
>> హనుమంతుని పూజించండి.
Also Read: Budh Gochar 2022: బుధుడి సంచారం.. నవంబరు 13 వరకు ఈ రాశుల వారికి కష్టకాలం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook