Shani Transit 2025: 2038 సంవత్సరం వరకు ఈ రాశులవారికి కష్టాలు తప్పవు..
Shani Rashifal Transit: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శని సాడేసతి కారణంగా జీవితంలో అనేక మార్పులు వస్తాయి. అయితే 2025 సంవత్సరంలో జరిగే శని గ్రహ సంచారం కారణంగా ఏయే రాశులవారి జీవితంలో మార్పులు వస్తాయో ఇప్పుడు తెలుసుకోండి.
Shani Rashifal Transit: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శని గ్రహానికి, శని దేవుడిని ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. అంతేకాకుండా అప్పుడప్పుడు శని చేసే కదలికలకు కూడా ఎంతో ప్రత్యేకత ఉంటుంది. అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శని గ్రహం అన్ని రాశులు సంచారం చేయడానికి మొత్తం 30 సంవత్సరాలు పడుతుంది. అంతేకాకుండా ఎవరి జాతకంలోనైతే శని అశుభ స్థానంలో ఉంటుందో, వారిపై శని సాడేసతి ప్రభావం పడుతుంది. శని సాడేసతి ప్రభావం కారణంగా వ్యక్తి గత జీవితంలో అనేక సమస్యలు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా శని అశుభ స్థానంలో ఉన్నవారికి తీవ్ర ఆర్థిక నష్టాలతో పాటు అనారోగ్య సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం శని ఒక రాశి నుంచి మరో రాశిలోకి సంచారం చేయడం వల్ల దాదాపు ఏడున్నర సంవత్సరాల పాటు పడుతుంది. అంతేకాకుండా జాతకంలో 12 వ స్థానంలో ఉన్నవారికి ఎక్కువగా శని ప్రభావం ఉంటుంది. అయితే 2038 సంవత్సరం వరకు ఏయే రాశుల వారికి శని సాడేసతి ప్రభావం ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.
2038 నాటికి శనిగ్రహం ఏయే రాశులవారిపై ప్రభావం పడుతుందో ఇప్పుడు తెలుసుకోండి:
జ్యోతిష్య శాస్త్రం ప్రస్తుతం శని గ్రహం కుంభ రాశిలో సంచార క్రమంలో ఉన్నాడు. అయితే 2025 సంవత్సరంలో మీన రాశిలో సంచారం చేస్తుంది. దీని కారణంగా ఈ సమయం నుంచి మేష రాశివారికి శని సాడేసతి ప్రభావం మొదటి దశ ఏర్పడుతుంది. అలాగే మీన రాశివారికి రెండవ, కుంభరాశి వారికి లాస్ట్ దశలు ప్రారంభమవుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.
ఆ తర్వాత కుంభ రాశివారికి శని సాడేసతి ప్రభావం జూన్ 3 2027 సంవత్సరం వరకు ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. శని సంచారం జరిగిన త్వరలోనే మేష రాశివారిపై ప్రత్యేక ప్రభావం పడి శని సాడేసతి ప్రారంభమవుతుంది. ఈ ప్రభావం దాదాపు 2032 సంవత్సరం వరకు కొనసాగుతుంది. అలాగే వృషభ రాశి వారికి 2027 సంవత్సరం, మిథునరాశి వారికి 2029 సంవతర్సంలో శని సాడేసతి ప్రభావం పడుతుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. దీని కారణంగా శని దృష్టి కుంభం, మీనం, మేషం, వృషభం, మిథునం రాశులవారిపై పడుతుంది.
ఈ రాశులవారికి శని నుంచి విముక్తి:
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, 2025 సంవత్సరంలో జరిగే శనిగ్రహ సంచారం కారణంగా మూడు రాశులవారికి శని సాడేసతి నుంచి ఉపశమనం లభిస్తుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఈ సంచారం కారణంగా మొట్టమొదట మకర రాశి వారికి శని సాడేసతి నుంచి విముక్తి లభిస్తుంది. అలాగే ఇదే సమయంలో కర్కాటక రాశి, వృశ్చిక రాశి వారికి కూడా శని సాడేసతి నుంచి ఉపశమనం లభిస్తుందని జ్యోతిష్యలు తెలుపుతున్నారు.
ఏలినాటి శని ఉన్నవారు ఇవి తప్పకుండా పాటించాలి:
శని దేవుడిని పూజించడం:
శనివారాల్లో శని దేవుడికి నల్ల నువ్వులు, నల్ల వస్త్రాలు, నల్లెలు సమర్పించి పూజించడం వల్ల శని దేవుడి అనుగ్రహం లభిస్తుంది.
శని దోష నివారణ పూజలు చేయించడం:
జ్యోతిష్యుల సలహా మేరకు శని దోష నివారణ పూజలు చేయించడం వల్ల ఏలినాటి శని ప్రభావాలను తగ్గించుకోవచ్చు.
దానాలు చేయడం:
శనివారాల్లో పేదలకు దానాలు చేయడం వల్ల శని దేవుడి అనుగ్రహం లభిస్తుంది. మంచి ఆలోచనలతో నడుచుకోవడం వల్ల కూడా శని అనుగ్రహం నుంచి విముక్తి లభిస్తుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి