Shani Transit 2024: శని ౩ సార్లు తన గమనాన్ని మారుస్తున్నాడు..ఈ ౩ రాశులవారు ఏడాది చివరికల్లా ధనవంతులవ్వడం ఎవరూ ఆపలేరట..
Shani Transit 2024: శని దేవుడిని కర్మ దేవుడిగా కూడా పిలుస్తారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శని న్యాయ దేవుడిగా పరిగణిస్తారు.
Shani Transit 2024: శని దేవుడిని కర్మ దేవుడిగా కూడా పిలుస్తారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శని న్యాయ దేవుడిగా పరిగణిస్తారు. ఒక వ్యక్తి మంచి పనులు చేస్తే అతని పట్ల సానుకూలంగా ఉంటాడు. ఒక వ్యక్తి తప్పు చేస్తే శనివక్ర దృష్టికి గురవుతాడు. అయితే, ఈ ఏడాది శని ౩ సార్లు తన గమనాన్ని మారుస్తాడు. దీంతో ఓ ౩ రాశులవారు ఈ ఏడాది చివరికల్లా ధనవంతులవుతారట.. ఆ రాశులు ఏంటో తెలుసుకుందాం..
కుంభ రాశి..
కుంభరాశికి చెందిన వారు ఈ సంవత్సరం వ్యాపారంలో లాభాలను పొందవచ్చు. మీ ఖర్చులను నియంత్రించుకోవాల్సిన అవసరం ఉంది. శనిదయ వల్ల కుంభరాశి వారికి 2024వ సంవత్సరం మంచిది. ఈ రాశికి చెందిన వ్యక్తులు మతపరమైన కార్యక్రమాలలో నిమగ్నమైపోతారు. ఈ రాశివారికి ఆర్థికంగా సహాయం చేయగల వ్యక్తులు కూడా ఈ ఏడాది ముందుకు వస్తారు. ఈ రాశివారికి మంచికాలం.
వృషభం..
వృషభరాశివారు వ్యాపారంలో ఏ సమస్య వచ్చినా బయటపడతారు. ఆరోగ్యంలో హెచ్చు తగ్గులు ఉండవచ్చు. వృషభరాశివారి ఆర్థికపరిస్థితి ఈ ఏడాది బాగుంటుంది. ఆగిపోయిన డబ్బు కూడా తిరిగి వస్తుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 2024 శని దేవుడి ప్రతి కదలిక ఈ రాశికి ప్రయోజనకరంగా ఉంటుంది. వృషభరాశివారికి లవ్ లైఫ్ కూడా బాగుంటుంది.
సింహరాశి..
సింహరాశివారు శనిదయ వల్ల భవిష్యత్తులో లాభం పొందే వ్యాపార భాగస్వామిని కూడా మీరు పొందవచ్చు. అంతేకాదు, భాగస్వామితో ఏవైనా విభేదాలు వస్తే వెంటనే సమసిపోతాయి. కెరీర్‌లో ఏ సమస్య వచ్చినా ఈ ఏడాది పరిష్కారం కానుంది. సింహ రాశి వారికి కూడా శని గమనంతో భారీ ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు.2024లో శనిదేవుడు మూడు, నాలుగు సార్లు తన స్థానాన్ని మార్చుకుంటాడు. 12 రాశులపై వీరి ప్రభావం కనిపిస్తుంది.దాని సానుకూల ప్రభావం వారిని ధనవంతులను చేస్తుంది. (Disclimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం జ్యోతిష్కులు గ్రహ సంచారం ఆధారంగా ప్రస్తావించారు. వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Zee Media ధృవీకరించలేదు.)
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook