Saturn Effect 2022: శనిగ్రహం కదలిక, స్థితి చాలా ముఖ్యం. ఇందులో ఏ చిన్నమార్పు వచ్చినా అది జీవితంపై ప్రభావం చూపిస్తుంటుంది. జూన్ నెలలో శని గ్రహంలో వస్తున్న మార్పుల ప్రభావం ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శని సక్రమమైన మార్గంలో ఉన్నా సరే చాలామంది జీవితాలపై దుష్ప్రభావం పడుతుంటుంది. మరి వక్రమార్గంలో ఉంటే ఇంకెలా ఉంటుంది. అదే జరగనుంది. జూన్ 5 నుంచి శనిగ్రహం వక్రమార్గం ప్రారంభం కానుంది. ఈ పరిస్థితుల్లో శనిదోషం, శని మహర్దశ ఉన్నవాళ్లు ఇబ్బందులు ఎదుర్కోవల్సి వస్తుంది. ప్రస్తుతం శని కుంభరాశిలో ఉన్నాడు. ఏప్రిల్ 29న కుంభరాశిలో ప్రవేశించాడు. ఇప్పుడు జూన్ 5 నుంచి మరో 141 రోజులవరకూ శని వక్రమార్గం ఉంటుంది. ఆ తరువాత అక్టోబర్ 23 నుంచి మారుతుంది.


శని వక్రమార్గం ఏ రాశులపై ప్రభావం


వక్రమార్గంలో ఉన్న శని ప్రభావం శనిదోషం ఉన్నవారిపై ఎక్కువగా పడుతుంది. కానీ సంబంధిత వ్యక్తి మంచి పనులు చేస్తుంటే మాత్రం ఆ ప్రభావం ఉండదు. శనిదేవుడిని ప్రసన్నం చేసుకునేందుకు పేదలు, అవసరం ఉన్న వ్యక్తులకు సహాయం చేయాలి.


మేషరాశి వారిపై శని వక్రమార్గం ప్రభావం చూపిస్తుంది. ధననష్టం సంభవించవచ్చు. అందుకే లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వివాహితుల జీవితంలో ఇబ్బందులు, ఒత్తిళ్లు రావచ్చు. 


కర్కాటక రాశివారిపై శని ప్రభావం ఉంటుంది. ఈ నేపధ్యంలో వక్రమార్గంలో ఉన్న ని ప్రభావం తీవ్రంగా ఉండబోతుంది. శని చెడు దృష్టి కారణంగా చేసే పనులు చెడిపోతాయి. దుర్ఘటన, గాయాలపాలవడం ఎదురుకావచ్చు. చాలా జాగ్రత్తగా ఉండాలి.


మకరరాశివారిపై ప్రస్తుతం శని దోషం నడుస్తోంది. జూన్ 5 నుంచి శని వక్రమార్గం కారణంగా వీరి ఇబ్బందులు మరింతగా పెరుగుతాయి. దీని దుష్ప్రభావం కెరీర్, రోజువారీ పనులు, సంబంధాలపై పడనుంది. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. 


కుంభరాశివారిపై ప్రస్తుతం శని ప్రభావం ఉంది. దాంతోపాటు శని వక్రమార్గం కారణంగా తీవ్ర పరిణామాలు ఎదురుకావచ్చు. ఈ పరిస్థితుల్లో వివాదాలకు దూరంగా ఉండాలి. పెట్టుబడుల విషయంలో జాగ్రత్త అవసరం. వివాహితుల జీవితంలో సమస్యలు ఉత్పన్నం కావచ్చు.


Also read: Tuesday Remedies: పేదరికం, అప్పుల నుండి బయటపడాలంటే.. మంగళవారం ఈ పనులు చేయండి!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.