Shani Vakri Negative Impact on Zodiac Signs: శని దేవుడు ఒక రాశి నుంచి ఇతర రాశికి సంచారం చేస్తాడు. ఈ సంచారం రెండున్నర సంవత్సరాలకు ఒక సారి జరుగుతుంది. అయితే శని దేవుడు రివర్స్‌లో సంచారం చేస్తే దానిని శని వక్రీ అని అంటారు. జూన్‌ 17న శని దేవుడు నేరుగా తిరోగమన దశలోకి వెళ్లబోతున్నాడు. మళ్లీ శని నవంబర్ 4న కుంభరాశిలో తిరోగమన దశలో తిరగబోతున్నాడు. శని తిరోగమన చలనం అన్ని రాశులవారిపై పడే అవకాశాలున్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ ప్రభావం వల్ల శని రాశి చక్రాలపై శుభ, అశుభ ప్రభావాలను చూపుతాడు అయితే ఈ శని తిరోగమన ప్రభావం ఏయే రాశులవారిపై పడబోతోందో ఇప్పుడు తెలుసుకుందాం.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తిరోగమనం వల్ల ఈ రాశువారికి కష్టాలు తప్పవా?:
వృషభం:

శని తిరోగమనం వల్ల వృషభ రాశివారికి చాలా రకాల దుష్ప్రభావాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఉద్యోగాల కోసం ట్రై చేస్తున్నవారు తప్పకుండా కొంత కాలం పాటు వేచి చూడాల్సి ఉంటుంది. మీరు చేసే పనుల్లో తొందరపాటు వల్ల తీవ్ర నష్టాలను ఎదుర్కొనే అవకాశాలున్నాయి. కాబట్టి ఈ క్రమంలో తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించడం చాలా మంచిది. అంతేకాకుండా ఆరోగ్యం పట్ల కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది.


మేషం:
శని తిరోగమనం మేషరాశివారిపై కూడా తీవ్ర చెడు ప్రభావాన్ని చూపబోతోందని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ క్రమంలో ఈ రాశివారు కష్టపడి పనులు చేస్తే ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా ఈ క్రమంలో తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే ఛాన్స్‌ కూడా ఉంది. ప్రేమ, వైవాహిక జీవితంలో వివాదాలు వచ్చే అవకాశాలున్నాయి. కాబట్టి తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు.


Also Read: Mrunal Thakur : 'సీత'ను రొమాంటిక్‌గానే చూడాలనుకుంటున్నారా?.. నెటిజన్ల కోరిక ఇదే


కర్కాటకం:
శని చేయబోతున్న తిరోగమనం ఈ రాశివారికి తీవ్ర దుష్ప్రభావాలను కలిగించవచ్చు. కాబట్టి ఈ క్రమంలో ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం చాలా మంచిదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వీలైనంత సానుకూలంగా ఉండి.. మంచి పనులు చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఒత్తిడి పెరిగి మానసిక సమస్యలు కూడా పెరిగే ఛాన్స్‌ కూడా ఉంది.  


కుంభ:
కుంభరాశిపై శని తిరోగమన ప్రభావం తీవ్రంగా పడబోతోంది. అయితే ఈ గ్రహం కుంభరాశిలో తిరోగమన దశలో కదలబోతున్నాడు. కాబట్టి ఈ రాశివారికి ప్రతికూల ప్రభావం పడే అవకాశాలున్నాయి. కాబట్టి ఈ క్రమంలో టెన్షన్ పెరిగే ఛాన్స్‌ ఉంది. వైవాహిక జీవితంలో సమస్యలు రావచ్చు.  తీవ్ర అనారోగ్య సమస్యలు కూడా వచ్చే ఛాన్స్‌ కూడా ఉంది.


తులారాశి:
తులారాశి వారు కూడా ఈ క్రమంలో తీవ్ర ఇబ్బందుల పాలవుతారని నిపుణులు చెబుతున్నారు. ఉద్యోగం మారాలని ఆలోచిస్తున్నవారు ఈ క్రమంలో అస్సలు మారొద్దని నిపుణులు చెబుతున్నారు. మీరు ఈ క్రమంలో తప్పని సరిగా మారితే తీవ్ర ఇబ్బందుల పాలవుతారు. అంతేకాకుండా తీవ్ర అనారోగ్య సమస్యలకు దారి తీయోచ్చు.


Also Read: Mrunal Thakur : 'సీత'ను రొమాంటిక్‌గానే చూడాలనుకుంటున్నారా?.. నెటిజన్ల కోరిక ఇదే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook