Lord Shanidev Remedies: శనిదేవుడు సూర్యభగవానుడు, ఛాయాదేవీల కుమారుడు. ఆయన మనం చేసుకున్న కర్మలను బట్టి ఫలితాలను ఇస్తుంటాడు. ఈయన సోదరుడు యమ ధర్మరాజు. జాతకంలో.. శని ప్రభావం వల్ల కొందరు తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. శనిదేవుడి ప్రభావం ఎలా ఉంటుందంటే.. ఓడలు బండ్లు అవుతాయి.. బండ్లు ఓడలుగా మారిపోతాయంటారు.  అందుకు కొందరు జాతకంలో శని ప్రభావం వల్ల తీవ్ర ఇబ్బందులుపడుతుంటే మరికొందరు మాత్రం శనిదేవుడి ఆశీస్సుల కోసం తమ ప్రయత్నాలు కొనసాగిస్తుంటారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Read More: Pune man Quits Job: ఇలాంటి టాక్సిక్ మనుషుల మధ్య పనిచేయలేను.. వైరల్ గా మారిన పూణే యువకుడి లాస్ట్ వర్కింగ్ డే సెలబ్రేషన్స్..


శని ప్రభావం..


శనిదేవుడు మనం చేసుకున్న కర్మలను బట్టి మాత్రమే ఫలితాలు ప్రసాదిస్తుంటాడు. అందుకు మనం గత జన్మలోచేసిన కొన్ని తప్పులకు ఇప్పుడు ఫలితం అనుభవిస్తుంటాం. కానీ ఇప్పుడుమాత్రం తెలిసి ఎవర్ని ఇబ్బందులు పెట్టకుండా మెలగాలి. ముఖ్యంగా శని దేవుడికి పేదలకు, రోడ్డుపైన ఉండేవారు, చెమటోడ్చి కష్టపడే వారంటే ఇష్టమంట. మనం రోడ్డుపైన కొందరు పేదలను,అమాయకులన మోసం చేస్తుంటారు. కొందరు కష్టపడి పనిచేస్తే, తగిన విధంగా డబ్బులు ఇవ్వకుండా.. ఎగ్గొడుతుంటారు. ఇలాంటి వారిని శనిదేవుడు చాలా ఇబ్బందులకు గురిచేస్తాడంట. అందుకు మనకు తెలిసి ఎవర్ని ఇబ్బందులు పెట్టకుండా చక్కగా మెలగాలి.


శనిదేవుడి  ఆరాధన..


ముఖ్యంగా జాతకంలో శనిదేవుడు చెడుస్థానంలో లేదా నీచపు స్థానంలో ఉండం వల్ల కొన్నిసార్లు చెడు ప్రభావం ను కల్గిస్తాడు. అందుకే శనిదేవుడిని శరణు కోరితే ఆయనమనకు వచ్చే ఆపదలను తొలగిస్తాడు. కత్తితో కలిగే పోటును.. సూది పోటుగా మారుస్తాడంటారు. శనిదేవుడికి ఏలినాటి, అర్ధష్టమ, సాడేసాతితో బాధపడుతున్నవారు ప్రతిశనివారం తైలాభీషేకం చేయించాలి. శనికి నలుపు బట్ట, నల్లనువ్వులను సమర్పించాలి. ఇలా ఒక పదకొండు వారాలు చేస్తే మన జీవితంలో ఉన్నత స్థానానికి ఎదుగుతాము.



శనివారం ఈవస్తువులు ఇంటికి తీసుకురావద్దు..


జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని వస్తువులు శనిదేవునికి అత్యంత ఇష్టమంట. అందుకు వీటిని శనివారం రోజున ఇంటికి అస్సలు తీసుకొని రావద్దని జ్యోతిష్యపండితులు చెబుతుంటారు . ముఖ్యంగా నువ్వుల నూనె, ఇనుప వస్తువులు,చెప్పులు, నవధాన్యాలు, కారం, ఉప్పులు మొదలైనవి శనివారం రోజున అస్సలు ఇంటికి తీసుకు రాకూడదు. అదే విథంగా ఎవరైన ఈ వస్తువులు శనివారం రోజున ఇచ్చిన కూడా తీసుకొవద్దరు..


Read more: Spiderman Costume: స్పైడర్మ్యాన్ కాస్టూమ్స్ లో బైక్ మీద రొమాన్స్.. దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన పోలీసులు.. వీడియో వైరల్..


శనిదేవుడి పూజా విధానం..


శనిదేవుడు హనుమంతుడి భక్తుడిగా చెప్తారు. అందుకే శనివారం రోజున భక్తులు ఆంజనేయ స్వామిని పూజించిన లేదా వెంకటేశ్వరస్వామిని పూజించిన కూడా ఆయన ఆనందపడతారంటారు. అదే విధంగా ఏడు శనివారాల వ్రతం చేసిన కూడా శనిదేవుడు ఎంతో ప్రభావం చూపిస్తాడని నమ్ముతారు. ఆయన అనుగ్రహం వల్ల మన కష్టాలన్ని దూరమైపోతాయని భక్తులు విశ్వసిస్తారు. శనివారం రోజున పేదలకు, గుడి బయట యాచకులకు స్వీట్లు పంచిపెట్టాలి. సమ్మర్ సీజన్ లో ముఖ్యంగా.. నీళ్లను దానంగా ఇవ్వాలి. చెప్పులను, వేడినుంచి ఉపశమం కలిగే ఏవైన దానంచేస్తే మంచిదని జ్యోతిష్యులు చెబుతుంటారు.(Disclimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం సోషల్ మీడియా వైరల్ కంటెంట్ ఆధారంగా ప్రస్తావించారు. వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Zee Mediaధృవీకరించలేదు.)



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter