For success Do these Shani Dev Remedies on Saturday: వారంలో ప్రతి రోజు ఏదో ఒక దేవుడికి లేదా దేవతకి అంకితం అని ప్రతిఒక్కరికి తెలుసు. శనివారం శని దేవుడికి అంకితమైనదిగా పరిగణిస్తారు. శని దేవుని ఆగ్రహం పొందిన వారు జీవితాంతం అనేక కష్టాలను ఎదుర్కొక తప్పదని ప్రజలు నమ్ముతారు. దాంతో శని దేవున్ని ప్రసన్నం చేసుకోవడం ఎంతో ముఖ్యమని నమ్ముతారు. శని దేవున్ని ప్రసన్నం చేసుకుంటే.. సమస్యలు తొలగిపోయి కుటుంబంలో ఆనందం మరియు శ్రేయస్సు పెరుగుతుంది. అయితే శని దేవుడిని ప్రసన్నం చేసుకునే మార్గాలు ఏమిటో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రావి చెట్టుకు నీరు, నువ్వులు:
ఒక్కోసారి కుటుంబంలో వివాదాలు జరగడం మామూలే. కానీ రోజూ ఇలాగే జరిగితే ఆ ఇంట్లో చెడు జరగడానికి ఎక్కువ సమయం పట్టదు. దాంతో కుటుంబంలో ఆనందం ఉండదు. మీ ఇంట్లో ఇలాంటివి జరుగుతుంటే. మీరు శనివారం తల స్నానం చేసి నాడు పీపల్ చెట్టు (రావి చెట్టు) వద్దకు వెళ్లి కొన్ని నల్ల నువ్వులను సమర్పించాలి. చెట్టు వేళ్లకు కూడా నీరు పోయాలి. ఇలా చేయడం వల్ల కుటుంబంలో సంతోషం నెలకొంటుంది. 


రావి చెట్టుకు పత్తి దారంతో:
మీ పనిలో పదే పదే ఆటంకాలు ఎదురవడం.. ఎన్నో ప్రయత్నాలు చేసినా విజయం సాధించలేకపోవడానికి కారణం శని దేవ్ మీ పట్ల అసంతృప్తిగా ఉండటమే. ఈ సమస్య నుంచి బయటపడాలంటే.. శనివారం నాడు పీపల్ చెట్టుకు పచ్చి పత్తి దారంతో 7 సార్లు చుట్టాలి. చుడుతున్న సమయంలో మీరు చిత్తశుద్ధితో శని దేవుడిని స్మరించుకోవాలి. ఇలా చేయడం వల్ల మీ కష్టాలు పూర్తవుతాయని సమసిపోతాయి.


నూనె, నువ్వులు, ఇనుము దానం:
కష్టపడి పనిచేసినా వ్యాపారంలో పురోగతి లేకుంటే.. శనివారం నాడు నూనె, నువ్వులు, ఇనుము, నల్లని వస్త్రాలు దానం చేయవచ్చు. ఇలా చేయడం వల్ల శని దేవుడు సంతోషించి తన భక్తుల కోరికలను తీరుస్తాడు. అంతే కాకుండా శనివారం నాడు శని యంత్రాన్ని పూజించడం వల్ల కూడా మేలు జరుగుతుంది.


పీపల్ మాల:
ఒక వ్యక్తి కోర్టు విషయాలలో అపజయాలు ఎదుర్కొంటే.. అతడు కూడా శనివారం ఓ పరిహారం చేయవచ్చు. శనివారం నాడు 11 పీపల్  ఆకులను మాలగా కుచ్చాలి. ఈ హారాన్ని సమీపంలోని శని ఆలయానికి దానం చేయాలి. దాంతో శని దేవుని అనుగ్రహం లభించి జీవితంలో అన్ని కష్టాలు తొలగిపోతాయి. 


Also Read: Puri Jagnnadh Daughter: టాలీవుడ్ ఎంట్రీకి సిద్దమైన పూరీ కూతురు.. ఛార్మీ సైడ్ అయినట్టేనా!  


Also Read: Agnipath Riots: అగ్నిపథ్‌ అల్లర్ల మాస్టర్ మైండ్ ఏపీలో అరెస్ట్?



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook