Shivratri 2022: శివరాత్రి రోజు ఏ పనులు చేయాలి..? చేయకూడని తప్పులు ఏమిటి..?
Shivratri 2022: మహాశివ రాత్రి వచ్చే నెల 1న రానుంది. మరి శివరాత్రి రోజు మహాశివుడిని పూజించడంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? త్రినేత్రుడి అనుగ్రహం పొందాలంటే ఏం చేయాలి?
Shivratri 2022: మహా శివరాత్రిని దేశవ్యాప్తంగా కోట్లాది మంది అత్యంత భక్తి, శ్రద్ధలతో జరుపుకుంటారు. ఈ ఏడాది శివరాత్రి మార్చి 1న రానుంది. దీనితో శివరాత్రి ఉత్సవాలకు దేశవ్యాప్తంగా ఉన్న శివాలయాలు సిద్ధమవుతున్నాయి.
మహాశివరాత్రి రోజు ఎంతో.. మంది భక్తులు ఉపవాస దీక్ష చేసి రాత్రికి జాగరణతో.. శివుడిని పూజిస్తారు. మిగతా రోజులతో పోలిస్తే.. శివరాత్రి రోజు మహా శివుడిని ఉపవాస దీక్షతో పూజిస్తే.. శివుడి అనుగ్రహం పొందొచ్చని భావిస్తుంటారు.
చాలా మంది భక్తితో ఉదయం నుంచి శివాలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు చేయిస్తారు. మరునాడు కూడా శివుడికి ప్రత్యేక పూజలు చేసిన తర్వాతే ఉపవాస దీక్షను విరమిస్తారు.
శివరాత్రి రోజు చేయాల్సిన, చేయకూడని పనులు..
శివరాత్రి రోజు.. ఉదయాన్నే లేచి తల స్నానం చేయాలి. కొత్త దుస్తులు ధరించాలి. రోజంతా శివుడిని స్మరించుకుంటూ ఉండాలి. మనస్సులో చెడు ఆలోచనలు రాకుండా చూసుకోవాలి. ఎవరికీ కీడు జరగాలని గానీ కోరుకోకూడదు.
శుభగడియల్లో మాత్రమే శివుడుకి పూజలు చేయాలి. ఈ సారి శివరాత్రి పర్వదినాన పూజలు చేసేందుకు శుభ సమయం సాయంత్రం 6.20 నుంచి.. రాత్రి 12.30 అని పండితులు చెబుతున్నారు. అయితే శివరాత్రి అంటేనే శుభ దినం కాబట్టి.. రోజంతా ఎప్పుడు పూజ చేసినా తప్పులేదని వివరిస్తున్నారు.
శివరాత్రి రోజు ఉపవాసం కఠినంగా పాటించాలి. శివాలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు చేసినప్పుడు నైవేద్యాన్ని కూడా తినకూడదు. ఉప వాస దీక్ష ఉన్న వారు శివరాత్రి ముగిసే వరకు వండిన ఆహారాన్ని అసలు ముట్టుకోవద్దని స్పష్టం చేస్తున్నారు పండితులు. అలా చేస్తే.. ఉవవాస దీక్ష వల్ల కలిగే ప్రయోజనాలు అందవని చెబుతున్నారు.
శివరాత్రి ముగిసే వరకు నిద్రపోకుండా.. శివుడి పాటలు పాడుతూ.. లేదా శివుడికి సంబంధించిన కథలు వింటూ ఉండాలి. అలా కాకుండా సినిమాలు చూడటం వంటి వాటివల్ల జాగరణం చేసినా లాభముండదని పండితులు అంటున్నారు. ఒక వేళ సినిమా చూసిన.. శివుడికి సంబంధించిన పౌరానిక సినిమాలు చూడటం కాస్త మేలైన పనని అంటున్నారు.
Also read: Horoscope 2022 February 26: నేటి రాశిఫలాలు.. ఇష్టదైవాన్ని వేడుకుంటే మరిన్ని శుభ ఫలితాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook