Transit of  Venus: గ్రహాలు  కాలానుగుణంగా రాశులను మారుస్తాయి. ఎవరి జాతకంలో శుక్రుడు శుభస్థానంలో ఉంటాడో వారికి దేనికీ లోటు ఉండదు. లవ్, రొమాన్స్, ఆనందం మరియు లగ్జరీ లైఫ్ కు కారకుడిగా శుక్రుడిని భావిస్తారు. మీ కుండలిలో శుక్రుడు బలహీన స్థానంలో ఉంటే మీరు అనేక సమస్యలను ఎదుర్కోంటారు. జూలై 07న శుక్రుడు సింహరాశిలోకి ప్రవేశించాడు. ఆగస్టు 07 వరకు ఇదే రాశిలో ఉండనున్నాడు. శుక్రుడి గోచారం వల్ల ఏయే రాశులవారు ప్రయోజనం పొందనున్నారో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శుక్ర సంచారం ఈ 3 రాశులకు వరం
వృషభం
వృషభ రాశి వారికి శుక్రుని రాశి మార్పు శుభప్రదంగా ఉంటుంది. వ్యాపారంలో భారీగా లాభాలు ఉంటాయి. ఉద్యోగులకు జీతం పెరగడంతోపాటు ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. ఈ సమయంలో మీరు ఏదైనా విలువైన వస్తువును కొనుగోలు చేసే అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్, పుడ్ కు సంబంధించిన బిజినెస్ చేసేవారు భారీగా ప్రయోజనం పొందుతారు.  
తులారాశి
సింహరాశిలో శుక్రుని ప్రవేశం తులారాశి వారికి అదృష్టాన్ని ఇస్తుంది. మీరు వృత్తి మరియు వ్యాపారం రెండింటిలోనూ లాభం పొందుతారు. బిజినెస్ లో మీరు భారీ డీల్ కుదుర్చుకునే అవకాశం ఉంది. మీరు ఆర్థికంగా లాభపడే అవకాశం ఉంది. డబ్బు సంపాదించేందుకు మీకు కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. షేర్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టడం ద్వారా మీరు లాభం పొందుతారు. 


Also Read: Sawan Shivratri 2023: శ్రావణ శివరాత్రి నాడు ఈ రాశులను వరించనున్న అదృష్టం.. మీది ఉందా?


సింహం
శుక్రుని సంచారం సింహ రాశి వారికి శుభప్రదంగా ఉండనుంది. మీ వ్యక్తిత్వం మెరుగుపడుతుంది. మీకు ప్రతి పనిలో విజయం లభిస్తుంది. సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. మీకు పెళ్లి ఫిక్స్ అయ్యే అవకాశం ఉంది. మీ వైవాహిక జీవితంలో ఆనందం వెల్లివిరిస్తుంది. పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. మీ ఆదాయం పెరుగుతుంది. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. 


Also read: Guru Vakri 2023: సెప్టెంబర్ నెలలో గురుడు తిరోగమనం.. ఈ 3 రాశులకు గోల్డెన్ డేస్ మెుదలు..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook