Shukra Gochar Impact on Zodiac Signs: సెప్టెంబర్ 24, శనివారం నాడు శుక్రుడు సింహరాశి నుండి కన్యారాశిలోకి (Veunu Transit in Virgo 2022) వెళ్లబోతున్నాడు. శుక్ర గ్రహం ఆనందం, శ్రేయస్సు, ఐశ్వర్యం, వైభవం, లగ్జరీ, ప్రేమ మరియు శృంగారానికి కారకుడిగా భావిస్తారు. ఆస్ట్రాలజీలో శుక్రుడిని శుభగ్రహం పరిగణిస్తారు. జాతకంలో శుక్రుడు బలంగా ఉన్న వ్యక్తుల జీవితంలో సంతోషం, శ్రేయస్సు, ప్రేమ మరియు విలాసాలకు లోటు ఉండదని చెబుతారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శుక్ర గ్రహం ఏదైనా రాశిలో సుమారు 23 రోజులు ఉంటుంది. తర్వాత అది దాని రాశిని మారుస్తుంది. శుక్రుడు రాశిచక్రాన్ని మార్చినప్పుడల్లా, అది ఖచ్చితంగా ప్రజల జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. కన్యారాశిలో శుక్రుడు సంచరించడం వల్ల కొన్ని రాశుల వారు అదృష్టవంతులు అవుతారు. ఈ శుక్ర సంచారం ఎవరికి ప్రయోజనకరంగా ఉంటుందో తెలుసుకుందాం.


ఈ రాశులవారికి శుభప్రదం
వృషభం (Taurus): వృషభ రాశికి అధిపతి శుక్ర గ్రహం. కన్యారాశిలో శుక్రుని సంచారం వృషభ రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. ఇంట్లో ఉన్న సమస్యలన్నీ పరిష్కారమవుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఈ రాశి వారు తమ వృత్తిలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మీ వైవాహిక జీవతం సంతోషంగా ఉంటుంది. 


మిధునరాశి (Gemini): మిథున రాశి వారు ల్యాండ్ కు సంబంధించిన లాభాలను పొందుతారు. వీరు భారీగా ధనాన్ని ఆర్జించే అవకాశం ఉంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. దీర్ఘకాలిక వ్యాధుల నుండి బయటపడతారు. వీరు తమదైన రంగంలో రాణిస్తారు. 


కర్కాటకం (Cancer): శుక్రుని రాశిలో మార్పు కర్కాటక రాశి వారికి కూడా శుభప్రదంగా ఉంటుంది. ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఈ సమయంలో వీరి ఆదాయం భారీగా పెరుగుతుంది. మీరు రుణ సంబంధిత సమస్యల నుండి బయటపడతారు. అలాగే ఆఫీసులో మీ పనికి ప్రశంసలు దక్కుతాయి. కెరీర్లో పురోగతి ఉంటుంది. ఉద్యోగంలో ప్రమోషన్ లభిస్తుంది.  


కన్య (Virgo): ఈ రాశి వారికి శుక్రుడు కన్యారాశిలోకి ప్రవేశించిన వెంటనే శుభ ఫలితాలను ఇవ్వడం ప్రారంభిస్తాడు. కన్యా రాశి వారికి ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. పెట్టుబడి పెట్టడానికి ఇదే మంచి సమయం కావచ్చు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు మంచి ఫలితాలను సాధిస్తారు. 


Also Read: Vakri Guru 2022: తిరోగమనంలో గురుడు.. నవంబరు 23 వరకు ఈ 3 రాశులవారి లైఫ్ సూపరో సూపరు..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu    


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook