Vakri Guru 2022: తిరోగమనంలో గురుడు.. నవంబరు 23 వరకు ఈ 3 రాశులవారి లైఫ్ సూపరో సూపరు..!

Vakri Guru 2022: జూలై 29న మీనంలో గురుడు తిరోగమనం చేశాడు. నవంబర్ వరకు బృహస్పతి తిరోగమనంలో ఉంటాడు. గురుడి తిరోగమనం కొన్ని రాశులవారికి కలిసి రానుంది.    

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Sep 19, 2022, 12:20 PM IST
Vakri Guru 2022: తిరోగమనంలో గురుడు.. నవంబరు 23 వరకు ఈ 3 రాశులవారి లైఫ్ సూపరో సూపరు..!

Guru Vakri  2022 effect: దేవతలకు గురువు బృహస్పతి. ఆస్ట్రాలజీ ప్రకారం ఈయన శుభఫలితాలను ఇస్తారు నమ్ముతారు. దేవగురు బృహస్పతి 12 సంవత్సరాల తర్వాత తన సొంత రాశి మీన రాశిలో తిరోగమనంలో (Jupiter retrograde in Pisces 2022) ఉన్నారు. నవంబరు 23 వరకు అదే స్థితిలో ఉంటారు. మీనరాశిలో గురుడు తిరోగమనం మూడు రాశులవారికి శుభప్రదంగా ఉండనుంది. ఆ అదృష్ట రాశులేంటో తెలుసుకుందాం. 

లక్కీ రాశులివే..
వృషభం (Taurus)- బృహస్పతి గ్రహం ఈ రాశి యెుక్క 11 వ ఇంట్లో తిరోగమనం సంచరించాడు. జ్యోతిషశాస్త్రంలో ఈ స్థలాన్ని లాభం మరియు ఆదాయ ఇల్లు అని పిలుస్తారు. దీంతో ఈ రాశివారికి వ్యాపారంలో భారీగా లాభాలు వస్తాయి. కొత్త మార్గాల ద్వారా ఆదాయం వస్తుంది. ఈ సమయంలో ఏదైనా ఆస్తి లేదా కొత్త వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఆరోగ్యం బాగుంటుంది.  

మిథునరాశి (Gemini)- మిథునరాశి వారికి తిరోగమన గురువు చాలా మేలు చేయనున్నాడు. గురు గ్రహం మిథునరాశి యొక్క పదవ ఇంట్లో తిరోగమనంలో ఉంది. బృహస్పతి ప్రభావం వల్ల మీకు కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగులు లాభపడతారు. వ్యాపారులకు  కూడా ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. 

కర్కాటకం (Cancer)- బృహస్పతి తిరోగమనం వల్ల ఈ రాశివారి అదృష్టం ప్రకాశిస్తుంది. పెండింగ్ లో ఉన్న పనులు పూర్తవుతాయి. ప్రయాణాలు మీకు లాభిస్తాయి. ఈ సమయంలో విద్యతో సంబంధం ఉన్న వ్యక్తులు ప్రయోజనం  పొందుతారు. వ్యాపారులకు భారీగా లాభాలను ఆర్జిస్తారు. 

Also Read: Powerful Rajyog: 59 ఏళ్ల తర్వాత అద్భుతం.. ఒకే రోజు 5 రాజయోగాల కలయిక.. ఈ రాశులవారికి ఊహించనంత ధనం! 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu    

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News