Shukra Gochar 2022: తులరాశిలోకి ప్రవేశించనున్న శుక్రుడు... ఈ రాశులవారికి లాభాలు షురూ..
Shukra Gochar 2022: జ్యోతిషశాస్త్రంలో గ్రహ సంచారాలు చాలా ముఖ్యమైనవిగా పరిగణించబడతాయి. అన్ని గ్రహాలు ఒక నిర్దిష్ట సమయం తర్వాత తమ రాశిని మార్చుకుంటాయి, ఇది అన్ని రాశిచక్రాలను ప్రభావితం చేస్తుంది. ఈ నెలలో శుక్రుడు తన సొంత రాశిలో సంచరించబోతున్నాడు.
Shukra Gochar 2022: ఆస్ట్రాలజీలో రాశిచక్రం యెుక్క మార్పు అనేది చాలా ముఖ్యమైనది. ఇది వ్యక్తి యెుక్క ప్యూచర్ ను ప్రభావితం చేస్తుంది. ప్రతి గ్రహం నిర్దిష్ట సమయం తర్వాత తన రాశిచక్రాన్ని మారుస్తుంది. ఇది మెుత్తం అందరి జీవితాలపై ప్రభావాన్ని చూపుతుంది. సంపద, ప్రేమ, శృంగారం, విలాస వంతమైన జీవితానికి కారకుడు శుక్రుడు. ఇది అక్టోబరు 18న తులరాశిలో (Venus transit in Libra 2022) ప్రవేశించబోతున్నాడు. తులరాశిలో శుక్రుడు సంచారం వల్ల మూడు రాశులవారికి లాభం చేకూరనుంది. ఆ అదృష్ట రాశులేంటో తెలుసుకుందాం.
ధనుస్సు రాశి (Sagittarius): శుక్రుడు ధనుస్సు రాశిలోని 11వ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. దీంతో ఈ రాశి వారికి వృత్తి, వ్యాపారాలలో విజయాలు లభిస్తాయి. దీంతో వీరి ఆదాయం కూడా బాగా పెరుగుతుంది. మీడియా, సినిమా లేదా ఫ్యాషన్ డిజైనింగ్ రంగానికి సంబంధించిన వ్యక్తులకు కూడా ఈ గ్రహ సంచారం శుభప్రదంగా ఉంటుంది. అదేవిధంగా స్టాక్ మార్కెట్ లేదా లాటరీలో పెట్టుబడి పెట్టాలని భావిస్తున్నట్లయితే ఇదే మంచి సమయం.
కన్య (Virgo): శుక్రుడు కన్యారాశిలోని రెండో ఇంట్లోకి ప్రవేశిస్తాడు. దీంతో ఈ రాశివారికి ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశం ఉంది. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. మార్కెటింగ్, విద్య మెుదలైన రంగాలతో సంబంధం ఉన్నవారు లాభపడతారు. ఈ సమయంలో పచ్చ రత్నాన్ని ధరించడం వల్ల ప్రయోజనం పొందుతారు.
మకరరాశి (Capricorn): ఈ రాశి వారి జాతకంలో శుక్ర గ్రహం పదో ఇంట్లో సంచరించబోతోంది. ఇది వారికి మంచి లాభాలను అందిస్తుంది. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారి కల ఫలిస్తుంది. ఉద్యోగులకు ప్రమోషన్ లేదా ఇంక్రిమెంట్ లభించే అవకాశం ఉంది. వ్యాపారులు భారీగా లాభాలను గడిస్తారు.
Also Read: Budhraditya Yog: కన్యారాశిలో బుధాదిత్య యోగం.. రాబోయే 18 రోజులు ఈ రాశులకు ప్రత్యేకం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook