Chaturmas 2022 : చాతుర్మాసంలో శివుడి అనుగ్రహం పొందాలంటే.. ఇలా చేయండి!
Chaturmas 2022 : ఆషాఢ శుక్ల ఏకాదశి తిథి నుండి కార్తీక శుక్ల ఏకాదశి తిథి వరకు ఉన్న కాలాన్ని చాతుర్మాసం అంటారు. ఈ మాసంలో ఏం చేయాలి, ఏం చేయకూడదు? తెలుసుకుందాం.
Chaturmas 2022 : ఆషాఢ మాసంలోని శుక్ల పక్ష ఏకాదశి తిథి నుండి చాతుర్మాసం ప్రారంభమైంది. ఈ ఏకాదశినే దేవశయని ఏకాదశి అంటారు. జూలై 10న ప్రారంభమైన శయన ఏకాదశి... కార్తీకమాసంలోని శుక్లపక్ష ఏకాదశితో ముగుస్తుంది. ఈ మధ్య ఉన్న కాలాన్నే చాతుర్మాసం (Chaturmas 2022) అంటారు. చాతుర్మాస్యం నాలుగు నెలల్లోనూ విష్ణువు యోగ నిద్రలో ఉంటే... శివుడు సృష్టి సంరక్షణ బాధ్యతలు తీసుకుంటాడు. అందుకే ఈ సమయంలో శివారాధాన చేయడం చాలా మంచిది. ఈ చాతుర్మాసంలోనే శ్రావణ మాసం కూడా వస్తుంది. ఈ నెలలో శివుడిని పూజించడం వల్ల భక్తుల కోరికలన్నీ తీరుతాయి. చాతుర్మాసంలో ఏం చేయాలి, ఏం చేయకూడదు ఇప్పుడు తెలుసుకుందాం.
చాతుర్మాసంలో ఏమి చేయకూడదు?
>> ఎలాంటి శుభకార్యాలు, ఫంక్షన్లు చేయకూడదు.
>> చాతుర్మాస సమయంలో మంచం మీద పడుకోకూడదు.
>> చా తుర్మాస కాలంలో పప్పు, మాంసం, పచ్చిమిర్చి, బెండకాయ, రేగు, ముల్లంగి, ఉసిరి, చింతపండు, ఉల్లి, వెల్లుల్లి మొదలైన వాటిని తినకూడదు.
చాతుర్మాసంలో ఏం చేయాలి?
>> చాతుర్మాసాల్లో హవిస్సులు సేవించాలి.
>> అన్నం, బార్లీ, నువ్వులు, వేరుశెనగ, గోధుమలు, ఉప్పు, ఆవు పాలు, పెరుగు, నెయ్యి, బెల్లం, మామిడి, కొబ్బరి, అరటిపండు వంటి ఆహార పదార్థాలు తినాలి.
>> చాతుర్మాస సమయంలో నేలపై పడుకోవాలి.
Also Read: Astro Tips: గుడి దగ్గర మీ చెప్పులు లేదా షూ పోయాయా? ఇక నుంచి మీ లైఫ్ కు తిరుగుండదు
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook