Astro Tips: గుడి దగ్గర మీ చెప్పులు లేదా షూ పోయాయా? ఇక నుంచి మీ లైఫ్ కు తిరుగుండదు

Astro Tips: గుడి దగ్గర చెప్పులు దొంగలించబడటం తరుచూ జరుగుతూ ఉంటుంది. ఇలా జరగడం కూడా మంచిదేనని జ్యోతిష్యశాస్త్రం చెబుతోంది.    

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jul 14, 2022, 03:48 PM IST
Astro Tips: గుడి దగ్గర మీ చెప్పులు లేదా షూ పోయాయా? ఇక నుంచి మీ లైఫ్ కు తిరుగుండదు

Astro Tips: సాధారణంగా మనం దేవుడి దర్శనం కోసం గుడికి వెళ్లినప్పుడు చెప్పులు బయట విప్పి లోపలకు వెళ్తాం. అలాంటప్పుడు మీ చెప్పులు గానీ లేదా బూట్లు (sandals Theft for temple) గానీ ఎవరైనా దొంగలిస్తారనే భయం మీ మనసులో ఉంటుంది. ఒక వేళ మీ చెప్పులు చోరీకి గురైనట్లయితే అప్పుడు మీరు బాధపడే బదులు సంతోషంగా ఉండండి. ఆస్ట్రాలజీ ప్రకారం, గుడి బయట మీ చెప్పులు ఎవరైనా కొట్టేసినట్లయితే అది చాలా శుభప్రదంగా భావిస్తారు. ఈ ఘటన శనివారం  జరిగితే మరి మంచిది. దీని వెనుక ఉన్న కారణాన్ని  తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 

కారణం తెలుసుకోండి..
జ్యోతిష్యశాస్త్ర ప్రకారం, శనివారం రోజున ఆలయం దగ్గర ఎవరి చెప్పులైనా దొంగలించబడినట్లయితే ఆ వ్యక్తికి చెడు కాలం నుండి విముక్తి లభిస్తుందని అర్థం. అంతేకాకుండా ఆ వ్యక్తి పేదరికం నుండి, అప్పులు మెుదలైన వాటి నుండి విముక్తి పొందుతారు. 

>> శనివారం నాడు ఆలయం నుండి పాదరక్షలు దొంగలించబడటం శుభప్రదంగా భావిస్తారు. ఎందుకంటే ఇది శని వల్ల కలిగే ఇబ్బందుల నుండి బయటపడవచ్చు. ఆస్ట్రాలజీ ప్రకారం, శనిగ్రహం పాదాలలో నివశిస్తుందని నమ్ముతారు.  
>>  చెప్పులు దానం చేయడం వల్ల శని దేవుడి అనుగ్రహం లభిస్తుంది. జాతకంలో శని వక్ర దృష్టి ఉండటం వల్ల ఏ పని సరిగా జరగదు. అలాంటప్పుడు శనివారం రోజున ఆలయంలో మీ యెుక్క చెప్పులు లేదా బూట్లు  దొంగిలించబడినట్లయితే అది శుభ సంకేతంగా భావిస్తారు.
>>  తోలు మరియు పెయింట్ రెండూ శని దేవుడికి సంబంధించినవి. కొంతమంది శనివారం నాడు ఆలయంలో తమ బూట్లు మరియు చెప్పులు వదిలివేస్తారు. ఇలా చేయడం వల్ల శనిదేవుడు మనిషికి కలిగే బాధలను తగ్గిస్తాడని నమ్ముతారు.

Also Read: Sravana Masam 2022: శ్రావణ మాసంలో ఈ రాశులవారిపై కనకవర్షం కురుస్తుంది! 

 

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News