kanuma festival 2022: సంక్రాంతి (Sankranti) తర్వాత రోజు జరుపుకునే పండుగ 'కనుమ'. ఈ ఫెస్టివల్ నే 'పశువుల పండుగ' అని కూడా అంటారు. ఈ రోజున గోవులకు, ఎడ్లకు ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ పండుగను పల్లెల్లో చాలా బాగా చేసుకుంటారు. మరీ ఈ పండుగ ప్రత్యేకతలేంటో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

* కనుమ రోజున రైతులకు వ్యవసాయంలో సహకరించే పశువులను (Cattle) పూజించడం ఆచారంగా పాటిస్తారు. ఈ రోజున కోడిపందాలు, ఎడ్ల పందాలు కూడా నిర్వహిస్తారు. ఈ సంవత్సరం కూడా జోరుగా బెట్టింగ్ జరుగుతోంది. పోలీసులు నిఘా పెట్టినా.. పందె రాయుళ్లు మాత్రం తగ్గేదే లే అంటున్నారు. 


* కనుమ రోజున మాంసాహారం (Non-vegetarian) వండుతారు. ఇంటికి వచ్చిన బంధుమిత్రులతో కోలాహలంగా, సందడిగా ఇంటి వాతావరణం కనిపిస్తుంది. గాలి పటాలు ఎగుర వేస్తూ ఎంతో ఆహ్లాదకరంగా ఈ పండుగను చేసుకుంటారు. కనుమ రోజున పెరుగును (Yogurt) దానం చేస్తే అద్భుత ఫలితాలు ఉంటాయంటారు.


* కనుమ రోజున మినుములు తినాలనే ఆచారముంది. మాంసం తినని వారికి  దాంతో సమానమైన పోషకాలని ఇచ్చేవి మినుములు.  అందుకే వారు మినపగారెలను చేసుకొని తింటారు. మినుములు ఈ చలికాలంలో ఒంట్లో తగినంత వేడిని పెంచేందుకు కూడా ఉపయోగపడతాయి. 


Also Read: Makar Sakranti 2022: తెలుగువారు 'సంక్రాంతి' పండుగను ఎందుకు జరుపుకుంటారు?


*  కనుమ రోజు ఆరెంజ్ కలర్ దుస్తులను (Orange color dress) ధరిస్తే మంచిది. ఈ రంగు దుస్తులను ధరిస్తే సుఖశాంతులు, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని జ్యోతిష్య శాస్త్రం వెల్లడిస్తోంది. 


* ఈ పండుగ రోజున ప్రయాణాలు చేయడం అరిష్టంగా భావిస్తారు. సంక్రాంతి అంటే మూడు రోజుల పండుగ...ఇల్లంతా బంధువులతో కళకళాలాడే సమయంలో మూడో రోజు ఎవరిళ్లకు వాళ్లు ప్రయాణం కావడం వల్ల చాలా ఆనందాన్ని మిస్ అవుతారనే ఉద్దేశంతో కూడా కనుమ రోజు ప్రయాణం చేయరాదని చెబుతారని అంటారు. అందుకే ‘కనుమ రోజు కాకి కూడా కదలదు’ అనే సామెత పుట్టి ఉండొచ్చంటారు. 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook