Solar Eclipse 2023: ఖగోళంలోని నిర్ణీత కక్షల్లో ప్రయాణిస్తూ..సూర్యుడికి, భూమికి మధ్య చంద్రుడు అడ్జుగా వచ్చినప్పుడు సూర్య గ్రహణం ఏర్పడుతుంది. అంటే ఆ సమయంలో చంద్రుడి నీడ కాస్సేపటి వరకూ భూమిపై సూర్య కిరణాలకు అడ్డుగా నిలుస్తుంది. ఇదొక సహజమైన, ప్రతి యేటా జరిగే ప్రక్రియ. కానీ హిందూ పంచాంగంలో ఈ గ్రహణంతో వివిధ విశ్వాసాలు ముడిపడి ఉన్నాయి. జాతకాలు ఆధారపడి ఉన్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సూర్య, చంద్ర గ్రహణాలు ఏర్పడటం సైన్స్ ప్రకారం సహజ ప్రక్రియ. కానీ హిందూ జ్యోతిష్యం ప్రకారం అసహజమైంది. అంత శుభ సూచకం కాదు. ఈ ఏడాది అంటే 2023లో తొలి సూర్య గ్రహణం ఏప్రిల్ 20న ఏర్పడనుంది. ఇండియా సహా దక్షిణాసియాలోని కొన్ని దేశాలు తప్ప మిగిలిన ప్రపంచంలో ఈ సూర్య గ్రహణం కన్పిస్తుంది.


సూర్య గ్రహణం సమయం ఎప్పుడు


2023 ఏప్రిల్ 20వ తేదీ ఉదయం 7 గంటల 5 నిమిషాలకు ప్రారంభం కానుంది. ఈ గ్రహణం మద్యాహ్నం 12 గంటల 29 నిమిషాలకు తొలగిపోతుంది. అంటే మొత్తం 5 గంటల 24 నిమిషాలుంటుంది. ఇండియాలో సూర్య గ్రహణం కన్పించనందున సూతకకాలం వర్తించదు. ఎక్కడైతే సూర్య గ్రహణం కన్పిస్తుందో ఆ ప్రాంతాలకే గ్రహణం సూతక కాలం వర్తిస్తుంది. అయితే 4 రాశులపై మాత్రం సూర్య గ్రహణం ప్రభావం స్పష్టంగా ఉండనుంది. ఈ 4 రాశులవారు అప్రమత్తంగా ఉండాలి. 


సూర్య గ్రహణంతో ప్రభావితం కానున్న రాశులు


వృశ్చిక రాశి


సూర్య గ్రహణం కారణంగా ఈ రాశివారికి ఆరోగ్య సంబంధిత సమస్యలు చుట్టుముడతాయి. ఆర్ధిక పరిస్థితి వికటిస్తుంది. డబ్బులకు ఇబ్బంది తలెత్తుతుంది. మీ ఆదాయ మార్గాలు తగ్గిపోతాయి. ప్రత్యర్ధులు మీపై విజయం పైచేయి సాధిస్తారు. ఖర్చులు పెరిగిపోతాయి. చాలా పనులు నిలిచిపోతాయి.


మకర రాశి


ఈ రాశి జాతకుల కుండలిలో నాలుగవ పాదంలో సూర్య గ్రహణం ఏర్పడుతుంది. ఫలితంగా అనేక సమస్యలు ఉత్పన్నమౌతాయి. పనిచేసేచోట సిబ్బంది, తోటి ఉద్యోగులతో విభేదాలు ఏర్పడతాయి. ఆదాయం పోల్చుకుంటే ఖర్చులు పెరుగుతాయి. ఇంట్లో జీవిత భాగస్వామితో గొడవలుంటాయి ఆర్ధిక ఇబ్బందులు వేధిస్తాయి..


మేష రాశి


సూర్య గ్రహణం ప్రభావం ఈ రాశివారికి దుష్ప్రయోజనం కల్గించనుంది. ఏ మాత్రం జాగ్రత్తగా లేకపోతే పొరుగువారితో గొడవలు ఏర్పడవచ్చు. కుటుంబంలో సోదర సోదరీమణులతో విబేధాలుంటాయి. ఆరోగ్య సంబంధిత సమస్యలు వెంటాడుతాయి. గ్రహణం తరువాత గురుడు మేషరాశిలో ప్రవేశించడం వల్ల కాస్త ఉపశమనం లభిస్తుంది.


కన్యా రాశి


సూర్య గ్రహణం ప్రభావం కన్యారాశిపై ప్రతికూలంగా ఉండనుంది. ఈ రాశివారికి తీవ్ర సమస్యలు ఎదురుకానున్నాయి. ఏదైనా దుర్ఘటన జరగవచ్చు. వాహనాలు నడిపేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. మానసిక ఒత్తిడికి లోనవుతారు. ఆలోచించి ప్రతి నిర్ణయం తీసుకోవాలి. ఖర్చులు నియంత్రించుకోవాలి.


Also read: Ramadan 2023: రంజాన్ నెలలో ముస్లింలు రోజా ఎందుకుంటారు, ఎప్పట్నించి ఇది ప్రారంభమైంది



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook