Solar Eclipse 2024 In Telugu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యగ్రహణానికి ప్రత్యేక ఉంటుంది. ఏప్రిల్ ఎనిమిదవ తేదీన సూర్యగ్రహణం ఏర్పడబోతోంది హిందువులకు ఎంతో ప్రాముఖ్యత కలిగిన ఉగాది పండుగకు ముందు రోజే ఈ గ్రహణం ఏర్పడడం అరుదైన యాదృచ్ఛికంగా భావించవచ్చు. అంతేకాకుండా ఈ సూర్యగ్రహణం రోజే చతుగ్రాహి యోగం కూడా ఏర్పడబోతోంది. ఇలా దాదాపు ఈ యోగం 500 సంవత్సరాల తర్వాత సూర్యగ్రహణం రోజున ఏర్పడడం ఎంతో శుభప్రదమని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఈ సమయంలోనే సూర్యగ్రహం మీనరాశిలో గ్రహ సంచారం దశలో ఉంటుంది. దీని కారణంగా ఈ గ్రహం శుభస్థానంలో ఉన్నవారికి అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ముఖ్యంగా ఈ సమయంలో కొన్ని రాశుల వారికి అదృష్టం పెరగడమే కాకుండా డబ్బు కూడా పొందుతారని వారంటున్నారు. అయితే ఈ సూర్యగ్రహణ సమయంలో ఏయే రాశుల వారికి శుభప్రదంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మేష రాశి:
మేష రాశి వారికి 500 సంవత్సరాల తర్వాత సూర్య గ్రహణం రోజు ఏర్పడే చతుగ్రాహి యోగం కారణంగా అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి ముఖ్యంగా అన్ని సమస్యల నుంచి వీరికి పరిష్కారం లభిస్తుంది. అంతేకాకుండా వీరికి ఆత్మవిశ్వాసం పెరిగి ఎలాంటి పనుల్లోనైనా విజయం సాధించగలిగే శక్తిని పొందుతారు. అలాగే వ్యాపారాలు వృత్తులు చేస్తున్న వారికి ఈ సమయం చాలా శుభప్రదంగా ఉంటుంది. ముఖ్యంగా వీరు ఆర్థిక లాభాలు పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. ఉద్యోగ అన్వేషణలో భాగంగా ఉన్నవారికి మంచి కంపెనీల నుంచి ఆఫర్స్ కూడా లభిస్తాయి. వారసత్వంగా వస్తున్న ఆస్తులు కూడా ఈ సమయంలో పొందే అవకాశాలు ఉన్నాయి. దీంతో పాటు ఆరోగ్యం కూడా ఇంతకుముందు ఉన్న దానికంటే ఇప్పుడు మెరుగు పడుతుంది.


ధనస్సు రాశి:
ధనస్సు రాశి వారికి ఈ సమయంలో ఇబ్బందుల నుంచి కాస్త ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా వీరు శుభముహూర్తాల్లో పనులు చేయడం కారణంగా విజయాలు సాధించే అవకాశాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఆర్థిక పరిస్థితులు ఈ సమయంలో మెరుగుపడతాయి. వీరికి కూడా విశ్వాసం పెరగడం కారణంగా కొత్త ప్రాజెక్టుల్లో పనులు చేసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతారు. ఇక ఉద్యోగాలు చేస్తున్న వారికి ఈ సమయంలో కొత్త కొత్త అవకాశాలు కూడా లభిస్తాయి. వ్యాపారాలు చేసేవారు కొత్త పెట్టుబడులతో ముందుకు వెళతారు. అలాగే ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి ఈ సమయం చాలా కలిసి వస్తుంది.


Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే..


సింహ రాశి:
సింహ రాశి వారికి కూడా చతుగ్రాహి యోగం కారణంగా అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. ముఖ్యంగా వీరికి ఆత్మవిశ్వాసం పెరిగి వ్యాపారాల్లో అద్భుతమైన నిర్ణయాలను తీసుకుంటారు. అంతేకాకుండా ప్రేమ జీవితం గడుపుతున్న వారికి ఈ సమయం చాలా లాబ్దాయకంగా ఉంటుంది. ముఖ్యంగా కుటుంబ సభ్యుల నుంచి ప్రోత్సాహం లభించి ఉన్నతమైన ఆలోచనలను పొందగలుగుతారు. అలాగే ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తున్న వారికి సమాజంలో కీర్తి ప్రతిష్టను లభిస్తాయి.


Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి