Som Pradosh Vrat 2022: సోమ ప్రదోష వ్రతం ఎప్పుడు? దీని ప్రాముఖ్యత ఏంటి?
Som Pradosh Vrat 2022 Date: ఆషాఢ సోమ ప్రదోష వ్రతం పాటించడం వల్ల జీవితంలో ఆనందంతోపాటు అంతులేని సంపద మీ సొంతం అవుతుంది.
Som Pradosh Vrat 2022 Date, Puja Vidhi: ఆషాఢ మాసంలోని శుక్ల పక్షంలోని త్రయోదశి రోజున ప్రదోష వ్రతం పాటిస్తారు. ఇది సోమవారం వస్తుంది కాబట్టి దీనిని సోమ ప్రదోష వ్రతం (Som Pradosh Vrat 2022) అని కూడా అంటారు. ఈ సారి సోమ ప్రదోష వ్రతం 11 జూలై 2022 నాడు వస్తుంది. జాతకంలో చంద్రుడు బలహీనంగా ఉన్న వ్యక్తులు ఈ వ్రతాన్ని చేయడం వల్ల ఆనందం మరియు శాంతిని పొందుతారు. పంచాంగం ప్రకారం, ఆషాఢ మాసంలోని శుక్ల పక్షం యొక్క త్రయోదశి తేదీ జూలై 11, సోమవారం నాడు 11:13 నుండి ప్రారంభమై.. జూలై 12 మంగళవారం ఉదయం 7:46 గంటలకు ముగుస్తుంది. సోమ ప్రదోష పూజ యొక్క శుభ సమయం రాత్రి 7:22 నుండి 9:24 వరకు ఉంటుంది.
4 శుభ యోగాలు
జూలై 11న సోమ ప్రదోష వ్రతాన్ని సర్వార్థ సిద్ధి యోగంలో పాటిస్తారు. ఈ రోజున శుక్ల యోగం ఉదయం నుండి రాత్రి 9:00 గంటల వరకు ఉంటుంది. ఆ తర్వాత బ్రహ్మయోగం ఏర్పడుతుంది. రవియోగం ఉదయం 5:15 నుండి 5:32 వరకు ఉంటుంది. సోమ ప్రదోష వ్రతంలో రవియోగం, శుక్ల యోగం, బ్రహ్మయోగం, సర్వార్థ సిద్ధి యోగం ఏకకాలంలో ఏర్పడుతున్నాయి. ఈ శుభ సమయాల్లో శివుడిని పూజించడం వల్ల విశేష ప్రయోజనాలు కలుగుతాయి.
వ్రత ప్రాముఖ్యత
సోమవార ప్రదోష నాడు ఉపవాసం ఉంటూ.. పూజలు చేయడం వల్ల శివపార్వతులు అనుగ్రహం లభిస్తుంది. ఇదే రోజున జయపార్వతి వ్రతాన్ని అఖండ సౌభాగ్యం కోసం పాటిస్తారు. పార్వతీమాత అనుగ్రహం వల్ల ఇల్లు సిరిసంపదలతో నిండి ఉంటుంది.
Also Read: Ashoka Plant Benefits: అశోక వృక్షం ఇంట్లో ఉంటే.. ధనలక్ష్మీ మీ వెంటే...! ఏదిశలో నాటాలో తెలుసుకోండి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook