Masik Shivratri July 2022 Benefits: శివుడికి ఎంతో ఇష్టమైన నెల శ్రావణ మాసం. ఈ నెలలో పరమశివుడిని పూజించడం వల్ల మీ కోరిన కోరికలు నెరవేరుతాయి. అదే విధంగా శివరాత్రి రోజున కూడా శివుడిని ఆరాధిస్తారు. ప్రతి నెల కృష్ణ పక్షం చతుర్దశి తిథి నాడు మాస శివరాత్రి (Masik Shivratri 2022) వ్రతం పాటిస్తారు. ఈసారి శ్రావణ మాస శివరాత్రి 26 జూలై 2022న వస్తుంద. ఈ రోజున పరమేశ్వురుడిని, పార్వతిదేవిని పూజిస్తారు. శ్రావణ మాసంలోని కృష్ణ పక్ష చతుర్దశి తేదీ జూలై 26, మంగళవారం సాయంత్రం 6:46 గంటలకు ప్రారంభమై... జూలై 27, బుధవారం రాత్రి 9:11 గంటలకు ముగిస్తుంది. శ్రావణ మాస శివరాత్రి నాడు ఈ పరిహారాలు చేయడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శివరాత్రి ప్రయోజనాలు: 
>>  శ్రావణ మాస శివరాత్రి నాడు శివుడికి పాలాభిషేకం చేస్తారు. ఇలా చేయడం వల్ల సంతానం లేని దంపతులకు పిల్లలు కలుగుతారని నమ్ముతారు.
>>  సంతానం కలగాలంటే శివలింగానికి నెయ్యి అభిషేకించాలి. 
>>  ఆర్థిక సమస్యల నుంచి విముక్తి పొందాలనుకునే వారు శ్రావణ శివరాత్రి రోజున ఉపవాసం ఉండి శివ స్తోత్రాన్ని పఠించి.. చెరుకు రసంతో శివునికి అభిషేకం చేయాలి. 
>>  మాస శివరాత్రి రోజున శివుని జలాభిషేకం చేయండి. ఇలా చేయడం వల్ల ఉత్తమ భర్త లభిస్తాడని అంటారు.
>>  ఆరోగ్యం, సంతోషం మరియు రోగాల నుండి బయటపడటానికి శ్రీ మహామృత్యుంజయ మంత్రాన్ని పఠించాలి. 


Also Read: Guru Purnima 2022: మీ కెరీర్ దూసుకుపోవాలంటే గురు పూర్ణిమ రోజు ఇలా చేయండి! 



 


స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook