Guru Purnima 2022 Shubh Sanyog: హిందూమతంలో గురు పూర్ణిమను చాలా పవిత్రమైన రోజుగా భావిస్తారు. ప్రతి సంవత్సరం ఆషాఢ మాసం పౌర్ణమి నాడు గురు పూర్ణిమ (Guru Purnima 2022) జరుపుకుంటారు. ఈ రోజున గురువును పూజిస్తారు. అంతేకాకుండా ఈ రోజే వ్యాస మహర్షి జన్మదినం కూడా. అందుకే దీనిని వ్యాసపూర్ణిమ అని కూడా అంటారు. ఈ ఏడాది గురు పౌర్ణమి 13 జూలై 2022 బుధవారం జరుపుకుంటున్నారు. ఈ రోజునే 4 రాజయోగాలు కూడా ఏర్పడటం వల్ల గురు పూర్ణమికి ప్రాధాన్యత పెరిగింది. ఈ పౌర్ణమి రోజున కొన్ని పరిహారాలు చేయడం ద్వారా మీరు ఎలాంటి సమస్య నుండైనా బయటపడతారు.
ఈ పరిహారాలు చేయండి
>> గురు పూర్ణిమ రోజున లక్ష్మీనారాయణ ఆలయంలో కొబ్బరికాయను కొట్టండి. ఈ రోజున విష్ణువును పూజించి.. మీ శక్తి మేరకు దానం చేయండి. ఈ రోజున పసుపు మిఠాయిలు, వస్త్రాలు దానం చేస్తే మంచిది. ఇలా చేయడం వల్ల జాతకంలో గురుదోషం తొలగిపోయి అదృష్టం కలిసివస్తుంది.
>> మీకు డబ్బుకు లోటు లేకుండా ఉండాలంటే.. గురు పూర్ణిమ నాడు అవసరమైన వారికి శనగ పప్పును దానం చేయండి.
>> మీ పెళ్లికి ఇబ్బందులు ఎదురవుతున్నట్లయితే గురు పూర్ణిమ రోజున గురు యంత్రాన్ని స్థాపించండి. దీని వల్ల మీ ఇంట త్వరలోనే పెళ్లి బాజాలు మోగుతాయి.
>> చదువులో విజయం సాధించలేకపోతున్నారా? అయితే గురు పూర్ణిమ రోజున గోవును పూజించండి. ఈ రోజున భగవద్గీతను పఠించడం ఎంతో మంచిది. గురు పూర్ణిమ రోజున గురువును పూజించి...ఆయన ఆశీర్వాదం తీసుకోండి. వారికి పసుపు బట్టలు దానం చేయండి. ఇలా చేయడం వల్ల అదృష్టం మీ తలుపు తడుతుంది.
Also Read: Vasudev Dwadashi 2022: ఇవాళ ఈ ఒక్క మంత్రాన్ని జపించండి.. మీ కష్టాలకు చెక్ పెట్టండి!
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook