Sun Transit 2023: హిందూ జ్యోతిష్యం ప్రకారం గ్రహాల గోచారం లేదా రాశి పరివర్తనం ప్రభావం అన్ని రాశులపై ఉంటుంది. అదే విధంగా సూర్యుడి రాశి పరివర్తనం ప్రభావం వివిధ రాశులపై గణీనీయంగా ఉంటుంది. సూర్యుడు దాదాపు ఏడాది కాలం తరువాత తన రాశి సింహంలో తిరిగి ప్రవేశించడం వల్ల అప్పటికే ఆ రాశిలో ఉన్న బుధుడితో కలిసి బుధాదిత్య రాజయోగం ఏర్పడింది. బుధాదిత్య రాజయోగం ప్రభావం అన్ని రాశులపై పడుతోంది. ముఖ్యంగా 3 రాశులకు జరగనున్న పరిణామాలు ఇలా ఉంటాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సింహ రాశి


సూర్యుడు ఏడాది తరువాత తనదైన సింహ రాశిలో ప్రవేశించాడు. సూర్యుడు ఇదే రాశికి అధిపతి. సెప్టెంబర్ 17 వరకూ ఇదే రాశిలో కొనసాగనున్నాడు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. నలుగురిలో గుర్తింపు ఉంటుంది.  కొన్ని నియమాలు పాటిస్తే సూర్యుడి కటాక్షం ఎప్పుడూ ఈ రాశిపై ఉంటుందంటారు. ఆర్ధికంగా ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కావు. ఇంట్లో పెద్దల్ని గౌరవించాలి. ఆర్ధికంగా ఎలాంటి సమస్యలు ఉండకపోవచ్చు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. 


కన్యా రాశి


సూర్యుడి సింహ రాశి ప్రవేశంతో ఏర్పడే బుధాదిత్య రాజయోగం కారమంగా కన్యా రాశి జాతకులు ఎక్కడికైనా తీర్ధయాత్రంలకు వెళ్లవచ్చు. తండ్రి తరపు నుంచి ఆర్ధికంగా సహకారం లభించవచ్చు. ఉద్యోగులకు, వ్యాపారులకు చాలా మంచి సమయం. ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. 


కర్కాటక రాశి


సూర్యుడు ఆగస్టు 17న సింహ రాశిలో ప్రవేశించాడు. సెప్టెంబర్ 17 వరకూ ఇదే రాశిలో కొనసాగనున్నాడు. గ్రహాల రాజైన సూర్యుడు సింహ రాశిలో అదే గ్రహాలకు యువరాజుగా భావించే బుధుడితో కలవనున్నాడు. ఈ రెండు గ్రహాల కలయికతో ఏర్పడే బుధాదిత్య రాజయోగం కారణంగా కర్కాటక రాశిపై ప్రభావం పడుతుంది. కొత్త వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు. ఉద్యోగులు లేదా వ్యాపారులు నిత్య జీవితంలో బిజీగా గడుపుతారు. కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడిపేందుకు ప్రయత్నించండి. ఈ నెలలో రక్షా బంధన్ రోజున మీ సోదరికి బహమతి ఇచ్చి ఆనందపర్చండి. జ్యోతిష్యులు సూచించే కొన్ని నిమయాలు పాటిస్తే కచ్చితంగా సూర్యుడి సింహ రాశి ప్రవేశం ప్రభావంతో కర్కాటక రాశి జాతకులు అద్భుతమైన లాభాలు పొందనున్నారు. 


Also read: Mercury Retrograde 2023: ఈ 5 రాశులకు ఇవాళ్టి నుంచి కనక వర్షమే. ఊహించని లాభాలు



 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook