Mercury Retrograde 2023: ఈ 5 రాశులకు ఇవాళ్టి నుంచి కనక వర్షమే. ఊహించని లాభాలు

Mercury Retrograde 2023: గ్రహాల, నక్షత్రాల పరివర్తనానికి జ్యోతిష్యం ప్రకారం విశేష ప్రాధాన్యత, మహత్యమున్నాయి. అదే సమయంలో గ్రహాల వక్రమార్గం కూడా అదే విధంగా ప్రభావం చూపిస్తుంటుంది. బుధుడి వక్రమార్గం ప్రభావం ఎలూ ఉంటుందో తెలుసుకుందాం..  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Aug 25, 2023, 09:48 AM IST
Mercury Retrograde 2023: ఈ 5 రాశులకు ఇవాళ్టి నుంచి కనక వర్షమే. ఊహించని లాభాలు

Mercury Retrograde 2023: హిందూ జ్యోతిష్యం ప్రకారం ఒక్కొక్క గ్రహాన్ని ఒక్కోలా పిలుస్తుంటారు. ముఖ్యంగా సూర్యుడిని గ్రహాలకు రారాజుగా, బుధుడిని యవరాజుగా, గురుడిని గురువుగా పిలుస్తుంటారు.  ఇప్పుడు గ్రహాల యువరాజు బుధుడి కదలికలో మార్పు  వివిధ జాతకులపై కీలకంగా ఉండనుంది. నిన్న రాత్రి నుంచి బుధుడి మార్గంలో వచ్చిన మార్పు , ఇతర ప్రభావాల గురించి పరిశీలిద్దాం.

బుధుడి పరివర్తనం మారింది. ఆగస్టు 24 వ తేదీ అంటే నిన్న రాత్రి నుంచి బుధుడు సింహ రాశిలో వక్రమార్గం పట్టాడు. అక్టోబర్ 1 వరకూ ఇదే పరిస్థితి కొనసాగుతుంది. బుధుడి గోచారంలో మార్పు అనేది సాధారణంగా మొత్తం 12 రాశులపై ప్రభావం చూపిస్తుంది. ముఖ్యంగా 5 రాశులకు ఇవాళ్టి నుంచి ఊహించిన విధంగా డబ్బు వచ్చి పడుతుంది. ఎక్కడ అడుగు పెట్టినా విజయం లభిస్తుంది. సమాజంలో మీ పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి...

బుధుడి తిరోగమనం ప్రభావం ముఖ్యంగా వృశ్చిక రాశి జాతకులపై చాలా కీలకంగా ఉండనుంది. అదృష్టం తోడుగా నిలవడంతో అమితమైన లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగులకు పదోన్నతితో పాటు ఇంక్రిమెంట్ లభిస్తుంది. అదే సమయంలో వ్యాపారులకు అమితమైన లాభాలు కలుగుతాయి. విదేశాలకు వెళ్లే అవకాశముంటుంది. ఆర్ధికంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తవు. ఆరోగ్యం మెరుగు పడుతుంది.

మీన రాశి జాతకులకు బుధుడి తిరోగమనం ప్రభావంతో అంతా కలిసొస్తుంది. విదేశాలకు వెళ్లే అవకాశం కలుగుతుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపనున్నారు. ఆదాయానికి కొత్త మార్గాలు తెర్చుకోవడమే కాకుండా ఊహించని లాభాలు కలగనున్నాయి. ఉద్యోగులకు కొత్త ఉద్యోగావకాశాలు లభిస్తాయి లేదా పదోన్నతి ఉంటుంది. ఇక వ్యాపారులకు లాభాలు పెరుగుతాయి. ఆర్ధికంగా ఎలాంటి సమస్య తలెత్తదు. ఆరోగ్యపరంగా ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకపోవచ్చు.

మిధున రాశి జాతకులుకు ఇది చాలా అనువైన, మంచి సమయం. బుధుడి తిరోగమనం ప్రభావంతో కొత్త అవకాశాలు లబిస్తాయి. సేవింగ్ ప్లానింగ్ బాగుంటుంది. ఇది భవిష్యత్‌కు ఉపయోగపడుతుంది. ఉన్నతాధికారులతో మీ సంబంధాలు మెరుగుపడి మీ కెరీర్ ఉన్నతికి దోహదమౌతుంది. వ్యాపారంలో లాభాలు ఆర్జిస్తారు. ఆర్దికంగా సమస్యలుండవు.

ఇక కన్యా రాశికి బుధుడి తిరోగమనం తిరుగులేకుండా చేస్తుంది. ఆర్ధిక పరిస్థితులు మెరుగుపడతాయి. పదోన్నతి లభిస్తుంది, ఇంక్రిమెంట్లు ఉంటాయి. ఉద్యోగావకాశాలు లభిస్తుంటాయి. వ్యాపారం విస్తృతమౌతుంది. అమితమైన లాభాలు కలుగుతాయి.

Also read: September 2023 Horoscope: సెప్టెంబర్ నెల ఆ నాలుగు రాశులకు మహర్దశ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News