Sun Transit 2023: సూర్యుడి రాశి పరివర్తనంతో ఈ 4 రాశుల ఇళ్లు డబ్బులతో నిండిపోవడం ఖాయం
Sun Transit 2023: హిందూ జ్యోతిష్యం ప్రకారం గ్రహాల రాశి పరివర్తనం లేదా గోచారానికి విశేష ప్రాధాన్యత, మహత్యమున్నాయి. సూర్యుడి గోచారం కారణంగా అద్భుతమైన లాభాలు కలగనున్నాయి. కేవలం 22 రోజుల్లో అంతులేని ధన వైభవాలతో మీ ఇళ్లు నిండిపోనుంది.
Sun Transit 2023: పంచాంగం ప్రకారం ప్రతి గ్రహం నిర్ణీత రాశిలో నిర్ణీత సమయంలో ప్రవేశించినట్టే సూర్యుడు ప్రతి నెలా రాశి పరివర్తనం చెందుతాడు. మే 15వ తేదీన సూర్య గోచారం వృషభరాశిలో జరిగింది. జూన్ 15 వరకూ అంటే మరో 22 రోజులు ఇదే రాశిలో సూర్యుడుంటాడు. ఈ ప్రభావం వివిధ రాశులపై ఎలా ఉంటుందనేది తెలుసుకుందాం..
సూర్యుడి ఇప్పటికే శుక్రుడి రాశి వృషభంలో ప్రవేశించాడు. జూన్ 15 వరకూ అదే రాశిలో ఉండటం వల్ల 4 రాశులవారికి ఊహించని లాభాలు కలగనున్నాయి. జీవితంలో అద్భుతమైన ఎదుగుదల కన్పిస్తుంది. ఈ నాలుగు రాశులకు ఎంతగా ధన సంపదలు కలుగుతాయంటే..మీరు కలలో కూడా ఊహించలేరు. ఇళ్లంతా డబ్బుతో నిండిపోగలదు. జ్యోతిష్యం ప్రకారం శుక్రుడు ధన వైభవానికి కారకుడైనందున శుక్రుడి రాశిలో సూర్యుడి ప్రవేశం కూడా భారీగా లాభాల్ని తెచ్చిపెడుతుంది. జూన్ 15 వరకూ ఈ 4 రాశులవారికి అభివృద్ధి, ఉన్నత పదవులు, ఊహించని డబ్బు లభిస్తాయి.
సూర్యుడి రాశి పరివర్తనం ప్రభావం ధనస్సు రాశి జాతకులపై ఊహించని విధంగా ఉంటుంది. అదృష్టం పూర్తిగా మారిపోతుంది. పెండింగులో ఉన్న డబ్బులు సైతం తిరిగి చేతికందుతాయి. ఉద్యోగాల్లో కొత్త అవకాశాలు మిమ్మల్ని ఉన్నత స్థానంలో కూర్చోబెడతాయి. వ్యాపారంలో అద్భుతమైన ప్రగతి ఉంటుంది. అప్పుల్నించి విముక్తి లభిస్తుంది. ఆర్ధికంగా పటిష్టమైన స్థితిలో ఉంటారు.
సూర్యుడు వృషభ రాశిలో గోచారం చేయడం మీన రాశి జాతకుల జీవిత భాగస్వామితో సంబంధాలు మెరుగుపడతాయి. వ్యాపారులు భారీగా లాభాలు ఆర్జిస్తే..ఉద్యోగులకు పదోన్నతి, ఇంక్రిమెంట్లు లభిస్తాయి. ఆర్ధికంగా మంచి స్థితిలో ఉంటారు. కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉండటమే కాకుండా ప్రయోజనం ఉంటుంది. పెళ్లి జీవితం ఆనందంగా గడుపుతారు. ఆరోగ్యంపై కాస్త అప్రమత్తత అవసరం.
సూర్యుడి గోచారం కర్కాటక రాశి జాతకులకు ఊహించని ప్రయోజనాల్ని అందించనుంది. బ్రహ్మచారులకు పెళ్లి నిశ్చయమౌతుంది. ఉద్యోగులకు పదోన్నతి, ఇంక్రిమెంట్లు లభిస్తాయి. కొత్త ఉద్యోగ అవకాశాలు కూడా ఉంటాయి. జీవితంలో అంతులేని ధన వైభవం కలుగుతుంది. కొత్త ఇళ్లు లేదా కొత్త వాహనం కొనుగోలు చేయనున్నారు. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.
సూర్యుడు వృషభ రాశిలో ప్రవేశించడం వల్ల సింహ రాశి జాతకులపై అనుకూల ప్రభావం కన్పిస్తుంది. ఆరోగ్యపరంగా జాగ్రత్త వహించాలి. ఇతర విషయాల్లో పట్టిందల్లా బంగారమే. కీలకమైన పదవీ బాధ్యతలు లభిస్తాయి. కెరీర్‌పరంగా ఊహించని అభివృద్ధి ఉంటుంది. భవిష్యత్‌లో మీ గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆర్ధికంగా పటిష్టంగా ఉంటారు.
Also read: Venus Transit 2023: శుక్రుడి గోచారం ప్రభావం 3 రాశులకు నిండిపోనున్న ఖజానా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook