Sun Transit 2023: సూర్య గోచారం ప్రభావం, ఈ రాశివారికి మార్చ్ 15 నుంచి కష్టాలు తప్పవు
Sun Transit 2023: గ్రహల రాశి పరివర్తనం లేదా గ్రహ గోచారానికి జ్యోతిష్యంలో విశేష ప్రాధాన్యత ఉంది. కారణం ఆ ప్రభావం ఇతర రాశులపై ప్రతికూలంగానో లేదా అనుకూలంగానో ఉండనుంది. సూర్యుడి గోచారం ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకుందాం..
సూర్యుడు మీనరాశిలో ప్రవేశించడం వల్ల మేషరాశి జాతకులపై తీవ్ర ప్రభావం పడనుంది. ఈ రాశి జాతకులు ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఆర్భాటాలకు పోకుండా ఉంటే మంచిది. ధనహాని కలుగుతుంది. ఇతర వివరాలు ఇలా ఉన్నాయి..
వివిధ రాశుల్లో గోచారం చేస్తూ సూర్యుడు మార్చ్ 15వ తేదీన మీనరాశిలో ప్రవేశించనున్నాడు. మీనం కంటే ముందు కుంభరాశిలో ఉండే సూర్యుడు రాశి పరివర్తనం చెందనున్నాడు. గ్రహాలకు రాజుగా భావించే సూర్యుడు..గురుగ్రహం రాశి మీనంలో ప్రవేశించి..ఏప్రిల్ 14 వరకూ ఉపస్థితుడౌతాడు. సూర్యుడి మీనరాశి ప్రవేశం మేషరాశివారిపై పడనుంది. ఈ రాశి జాతకులు ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. ఉద్యోగులు మరింత కష్టపడాల్సి ఉంటుంది. ప్రభుత్వ విభాగంలో పనిచేసేవారికి ఎక్కువ శ్రద్ధ అవసరమౌతుంది. తప్పులు దొర్లకుండా చూసుకోవాలి. మీ బాస్ మీపై ఆనందంగా ఉండేట్టు చూసుకోవాలి. అందుకే పనితీరు మెరుగుపర్చుకునే దిశగా ఎక్కువ కష్టపడాలి.
వ్యాపారం చేసే చోట దొంగతనం లేదా నష్టం సంభవించే అవకాశాలున్నాయి. అందుకే విలువైన వస్తువులున్న గదిలో సీసీటీవీ వ్యవస్థ ఏర్పాటు చేయాలి. దొంగతనాలు జరగకుండా సెక్యూరిటీ వ్యవస్థను పటిష్ఠం చేయాలి. ఆర్ధిక లావాదేవీలు స్వయంగా చేయడం మంచిది. ఇతరుల జోక్యం మంచిది కాదు. లేకపోతే మోసపోయే ప్రమాదముంది. ఉన్నత విద్య కోరుకునేవారికి ఇది చాలా అనువైన సమయం. విద్యార్ధులు చదువుపై ఫోకస్ పెట్టాలి.
మరొకరి అబద్ధాల్లో పడవద్దు. అబద్ధపు హామీలకు దూరంగా ఉండండి. అంటే పద్ధతి ప్రకారం పనిచేస్తే ఏ విధమైన నష్టం ఉండకపోవచ్చు. యువకులు కఠిన నిర్ణయాలు తీసుకోవచ్చు. ఉద్యోగంలో ఉన్నవాళ్లు వివాదాలకు దూరంగా ఉండాలి. మేషరాశి జాతకులు ఆర్భాటాలకు పోకుండా ఉంటే మంచిది. ఆర్భాటాలు వంటివాటిలో చిక్కుకుంటే డబ్బులు వృధా అవుతాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త. ఎసిడిటీ సమస్యలు రావచ్చు. దుమ్ము ధూళి, ఎండ నుంచి కాపాడుకోవాలి. ఎందుకంటే ఎలర్జీ సమస్యలు ఉత్పన్నం కావచ్చు.
Also read; Shani gochar 2023: శతభిష నక్షత్రంలోకి శని.. ఈ 6 రాశుల వారు తస్మాత్ జాగ్రత్త!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook