Sun Transit 2024 Aries: హిందువులకు ఎంతో ప్రాముఖ్యత కలిగిన క్రోధి నామ సంవత్సరం ఏప్రిల్ 9వ తేదీ నుంచి ప్రారంభమైంది. అయితే ఈ ఏడాది ప్రారంభమైన ఐదు రోజులకే సూర్యుడు సంచారం చేయబోతున్నాడు. ఈ గ్రహం ఏప్రిల్ 13వ తేదీన మేషరాశిలోకి సంచారం చేయబోతోంది. ఇలా సంచారం చేయడం కొన్ని రాశుల వారికి చాలా శుభప్రదం అని జ్యోతిష్యులు చెబుతున్నారు. అలాగే ఇప్పటికే మేషరాశిలో బుధుడు సంచార దశలో ఉన్నాడు. ఇక సూర్యుడు కూడా ఏప్రిల్ 13వ తేదీన మేషరాశిలోకి ప్రవేశించడం వల్ల ఎంతో ప్రాముఖ్యత కలిగిన బుధాదిత్య రాజయోగం ఏర్పడబోతోంది. అంతేకాకుండా ఇప్పటికే ఆ గ్రహంలో గృహస్పతి కూడా సంచార దశలో ఉంది. దీని కారణంగా కొన్ని రాశుల వారిపై ఎంతో ప్రత్యేకమైన యోగ ప్రభావం ఏర్పడి ఊహించని లాభాలతో పాటు కెరీర్లో పురోగతి సాధిస్తారని జ్యోతిష్యులు చెబుతున్నారు. అయితే ఈ రాజయోగం వల్ల ఏయే రాశుల వారికి ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకోండి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మేష రాశి:
మేష రాశి వారికి ఈ బుధాదిత్య రాజయోగం వల్ల విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా వీరికి మానసికంగా వస్తున్న సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. దీంతోపాటు కెరీర్ కు సంబంధించిన ప్రయోజనాలు కూడా పొందే అవకాశాలున్నాయి. అంతేకాకుండా వ్యాపారాలు చేస్తున్నవారు పెట్టుబడులను పెంచే అవకాశాలు కూడా ఉన్నాయి. దీని కారణంగా వారి దశతిరిగి విపరీతమైన ధన లాభాలు కలుగుతాయి. అలాగే ఉద్యోగాలు చేస్తున్న వారికి కార్యాలయాల్లో ప్రమోషన్స్ లభించే ఛాన్స్ కూడా ఉంది. దీంతో పాటు కొన్ని సవాళ్లను కూడా ఎదుర్కొంటారు. కాబట్టి జాగ్రత్తగా ముందుకు నడుచుకోవడం చాలా మంచిది. ఇక వ్యాపారాలు చేస్తున్నవారు భారీ మొత్తంలో డీల్స్ పొందుతారు.


మిథున రాశి:
సూర్యుడు మేషరాశిలోకి సంచారం చేయడం కారణంగా ఏర్పడే ప్రత్యేక యోగ ప్రభావం మిథున రాశి వారిపై కూడా పడుతుంది. దీని కారణంగా వీరికి భౌతిక సుఖం కూడా పెరుగుతుంది. అలాగే వ్యక్తిగత జీవితంలో వస్తున్న సమస్యలన్నీ పరిష్కారమవుతాయి. దీంతో పాటు మీ జీవిత భాగస్వామి సపోర్టు లభించి, అన్నీ పనులు సులభంగా చేయగలుగుతారు. అలాగే ఇద్దరి మధ్య ప్రేమ కూడా పెరుగుతుంది. ఇక వ్యాపారాలు చేస్తున్న వారి విషయానికొస్తే, ప్రత్యర్థుల నుంచి అనేక సవాళ్లు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తెలివితేటలతో ముందుకు నడుచుకోవడం చాలా మంచిది. అంతేకాకుండా ఈ సమయంలో ఆదాయం పెంచుకోవడానికి కొత్త కొత్త ఆదాయ వనరులు లభించే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా ఈ యోగ ప్రభావంతో వీరికి విజయ కాలం ప్రారంభం అవుతుంది.


Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే..a


కర్కాటక రాశి:
కర్కాటక రాశి వారికి ఈ సూర్యుడు సంచారం ఎంతో శుభప్రదంగా ఉంటుంది. ముఖ్యంగా వృత్తి జీవితం కొనసాగిస్తున్న వారికి ఈ సమయంలో విపరీతమైన లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా శుభవార్తలు కూడా వినే అవకాశాలు ఉన్నాయి. ఇక డబ్బు పరంగా చూస్తే ఈ సమయంలో వీరికి ఎలాంటి డోకా గా ఉండదు. దీంతోపాటు ఉద్యోగాలు చేస్తున్న వారికి కూడా ప్రమోషన్స్ లభించవచ్చు. ఆఫీసుల్లో సీనియర్లతో ప్రశంసలు పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక కెరీర్ పరంగా చూస్తే ఈ సమయంలో అనేక శుభవార్తలు వింటారు. దీంతో పాటు గొప్ప గొప్ప అవకాశాలు పొందుతారు. ఇక కుటుంబ సభ్యుల మధ్య బంధం మరింత బలపడి ఎంతో ఆనందంగా గడుపుతారు.


Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి