Sun Transit in Cancer 2022: సూర్యభగవానుడు ప్రతి నెలా రాశిని మారుస్తాడు. ఈ విధంగా సూర్యుడు ఏడాది పొడవునా మొత్తం 12 రాశులలో సంచరిస్తాడు. రేపు అంటే జూలై 16 శనివారం నాడు సూర్యుడు రాశిని మార్చబోతున్నాడు. కర్కాటక రాశిలో సూర్యుడు (Sun Transit in Cancer 2022) ప్రవేశించనున్నాడు. దీన్నే కర్క సంక్రాంతి అంటారు. చంద్రుని రాశిలోకి సూర్యుని సంచారం అన్ని రాశులపై పెను ప్రభావాన్ని చూపుతుంది. సూర్యుడు నెల పాటు కర్కాటక రాశిలో ఉంటాడు. ఈ సమయంలో కొన్ని రాశులవారికి కలిసి రానుంది. ఆ అదృష్ట రాశులేంటో తెలుసుకుందాం.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మిథునం (Gemini) : సూర్యుని రాశి మార్పు మిథున రాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది.  ఉద్యోగస్థుల జీతాలు పెరుగుతాయి. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నవారు లేదా ప్రభుత్వ రంగానికి సంబంధించిన పనులు చేసేవారు భారీగా లాభాలను ఆర్జించే అవకాశం ఉంది. 


సింహం (Leo): కర్కాటక రాశిలో సూర్యుని ప్రవేశం సింహ రాశి వారికి మేలు చేస్తుంది. వ్యాపారుల భారీగా లాభాలు ఆర్జిస్తారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఇతరుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. ఆదాయం పెరిగే అవకాశం ఉంది. 


తుల (Libra): తుల రాశి వారికి సూర్య సంచారం కలిసి వస్తుంది. వీరి కెరీర్ దూసుకుపోతుంది. కొత్త జాబ్ వస్తుంది. మీరు ప్రశంసలు అందుకుంటారు. కుటుంబ మద్దతు ఉంటుంది. ఏదైనా ఆస్తి కొనుగోలు చేయలనుకుంటే ఇదే మంచి సమయం. భారీగా డబ్బు సంపాదిస్తారు. 


వృశ్చికరాశి (Scorpio) : సూర్య సంచారం వృశ్చికరాశికి చాలా లాభాలను ఇస్తుంది. మంచి జాబ్ ఆఫర్లు వస్తాయి. కొన్ని విషయాలు మీకు కలిసి వస్తాయి. మీరు ఏ పని  చేసినా అందులో విజయం సాధిస్తారు. వ్యాపారులు లాభపడతారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది.  


Also Read: Kark Sankranti Mantralu 2022: కర్క సంక్రాంతి నాడు ఈ 10 మంత్రాలు జపిస్తే చాలు..జూలై 16 నుంచి అన్ని సమస్యలూ దూరం 



 


స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook