Kark Sankranti Mantralu 2022: కర్క సంక్రాంతి నాడు ఈ 10 మంత్రాలు జపిస్తే చాలు..జూలై 16 నుంచి అన్ని సమస్యలూ దూరం

Kark Sankranti Mantralu 2022: సూర్యుడి రాశి మారడాన్నే సంక్రాంతిగా పిలుస్తారు. ఏ రాశిలో సూర్యుడి ప్రవేశిస్తాడో..ఆ రాశిని సంక్రాంతి అంటారు. జూలై 16 న సూర్యుడు కర్కాటక రాశిలో పవేశించే..కర్క సంక్రాంతి నాడు ఈ చిన్న పని చేస్తే..అంతులేని ధనం, బుద్ధి వికసితమవడం జరుగుతుంది...

Last Updated : Jul 14, 2022, 08:13 PM IST
Kark Sankranti Mantralu 2022: కర్క సంక్రాంతి నాడు ఈ 10 మంత్రాలు జపిస్తే చాలు..జూలై 16 నుంచి అన్ని సమస్యలూ దూరం

Kark Sankranti Mantralu 2022: సూర్యుడి రాశి మారడాన్నే సంక్రాంతిగా పిలుస్తారు. ఏ రాశిలో సూర్యుడి ప్రవేశిస్తాడో..ఆ రాశిని సంక్రాంతి అంటారు. జూలై 16 న సూర్యుడు కర్కాటక రాశిలో పవేశించే..కర్క సంక్రాంతి నాడు ఈ చిన్న పని చేస్తే..అంతులేని ధనం, బుద్ధి వికసితమవడం జరుగుతుంది...

హిందూమతంలో ప్రతి సంక్రాంతికి ఓ మహ్యత్యం, ప్రాధాన్యత ఉన్నాయి. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం సూర్యుడి ఏ రాశిలో ప్రవేశిస్తున్నాడో ఆ రాశిని సంక్రాంతిగా పిలుస్తారు. ఈసారి సూర్యుడు కర్కాటక రాశిలో ప్రవేశించనుండటంతో..కర్క సంక్రాంతిగా అభివర్ణిస్తారు. మకర సంక్రాంతి అంటే మకర రాశిలో ప్రవేశించడం. హిందూమతంలో మకర సంక్రాంతి తరువాత కర్క సంక్రాంతికి అధిక ప్రాధాన్యత ఉంది. కర్క్ సంక్రాంతి నుంచి పగటి సమయం తక్కువగానూ..రాత్రి సమయం ఎక్కువగానూ ఉంటాయి. సూర్యుడి ఈసారి జూలై 16న కర్కాటక రాశిలో ప్రవేశించనున్నాడు. ఆ రోజున సూర్యుడి పూజకు ఎనలేని మహత్యముంది. సూర్యుడిని జలం సమర్పించేటప్పుడు..ప్రత్యేక మంత్రాల్ని పఠిస్తే అధిక ప్రయోజనాలుంటాయి. ఆ మంత్రాలేంటో తెలుసుకుందాం..

కర్క్ సంక్రాంతి నాడు పఠించాల్సిన మంత్రాలు

ఓం హ్రోం ఖగాయ నమహ
ఈ మంత్రంతో వ్యక్తి శారీరక శక్తి పెరుగుతుంది. బుద్ధి వికసితమౌతుంది. 

ఓం హ్రాం మిత్రాయ నమహ
ఈ మంత్రం జపించడం వల్ల ఆరోగ్యం మెరుగౌతుంది. దాంతోపాటు గుండెకు శక్తి లభిస్తుంది. 

ఓం హ్రీం రవయే నమహ
ఈ మంత్రం పఠించడం వల్ల ట్యూబర్‌క్లోసిస్ వంటి దీర్ఘకాలిక తీవ్ర వ్యాధుల్నించి ఉపశమనం లభిస్తుంది. త్వరగా విముక్తి లభిస్తుంది. దాంతోపాటు..ఆ వ్యక్తికి ఉండే కఫం సమస్య పోతుంది. రక్త ప్రసరణ మెరుగౌతుంది. 

ఓం హ్రూం సూర్యాయ నమహ
మానసిక ప్రశాంతి కోసం సూర్యుడిని పూజిస్తూ ఈ మంత్రం పఠించాలి

ఓం హ్రాం భానవే నమహ
జ్యోతిష్యం ప్రకారం మూత్రాశయం, కిడ్నీ సంబంధిత రోగాల్నించి పోరాడటంలో ప్రయోజనం కలుగుతుంది. 

ఓం హ్రాం హిరణ్యగర్భార్య నమహ
విద్యార్ధులు ఈ మంత్రం తప్పకుండా పఠించాలి. దీనివల్ల విద్యార్ధుల మేధస్సు తేజోవంతమౌతుంది. మెమరీ పెరుగుతుంది. 

ఓం హం పూషణే నమహ
ఈ మంత్రం జపించడం వల్ల ధైర్యం, సంయమనం కలుగుతాయి. బుద్ధి వికసితమౌతుంది. శక్తివంతుడిగా మారుతారు.

ఓం భాస్కరాయ నమహ
కర్క్ సంక్రాంతి నాడు ఈ మంత్రం జపించడం వల్ల శరీరంలో అంతర్గతంగా స్వచ్ఛత లభిస్తుంది. 

ఓం ఆదిత్యయాయ నమహ
ఆర్ధికపరమైన సమస్యల్నించి విముక్తి పొందేందుకు జూలై 16న సూర్యుడిని జలం సమర్పించేటప్పుడు ఈ మంత్రాన్ని పఠించాలి. దీనివల్ల అంతులేని ధనం లభిస్తుంది. 

ఓం ఆకార్య నమహ
మానసికంగా పటిష్టంగా ఉండేందుకు ఈ మంత్రాన్ని జపించాలి. దీనివల్ల జీవితంలో ఎదురయ్యే అన్ని సమస్యలు దూరమౌతాయి.

Also read: Ekmukhi Rudraksha: ఏకముఖి రుద్రాక్ష ప్రయోజనాలు, రుద్రాక్ష అసలైందా..నకిలీదా ఎలా గుర్తించడం

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News