Surya rashi parivartan 2022: ఆస్ట్రాలజీలో గ్రహాల రాశి మార్పు చాలా ముఖ్యమైనదిగా భావిస్తారు. మరో ఐదు రోజుల తర్వాత అతి పెద్ద రాశి మార్పు జరగబోతుంది. సూర్యభగవానుడు తన రాశిని మార్చబోతున్నాడు. సెప్టెంబరు 17న సూర్యుడు తన సొంత రాశి అయిన సింహరాశి నుండి కన్యారాశిలోకి (Sun transit in virgo 2022) ప్రవేశించనున్నాడు. దీని ప్రభావం కారణంగా కొన్ని రాశులవారికి మంచి ఫలితాలు, కొందరికి అశుభ ఫలితాలు కలుగుతాయి. సూర్యుడి రాశి మార్పు ఏ  రాశివారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మేషం (Aries)- సూర్య సంచారం కారణంగా ఈ రాశివారు ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోవడం అవసరం. వ్యాపార పని మీద విదేశాలకు వెళ్లడం మీకు కలిసి వస్తుంది. మిత్రుల సపోర్టు లభిస్తుంది. ఈ సమయంలో ఓపికతో ఉండటం అవసరం.  


వృషభం (Taurus) - ఈ సమయంలో ఈ రాశివారు ఆనందంగా ఉంటారు. ఖర్చులు అధికంగా చేస్తారు.  ఉద్యోగంలో అధికారుల సపోర్టు లభిస్తుంది. మీ కెరీర్ లో పురోగతి సాధిస్తారు. 


మిథునం (Gemini)- ఈ సమయంలో అనవసరంగా కోపం తెచ్చుకోకండి. మీ మనస్సులో ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండండి. వ్యాపార పరిస్థితులు మెరుగుపడతాయి. వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది.  కుటుంబ బాధ్యతలు పెరగవచ్చు.


కర్కాటకం (Cancer)- ఆదాయం మెరుగ్గా ఉంటుంది. ఖర్చులు భారీగా పెరుగుతాయి. విద్యా విషయాలలో ఆశించిన ఫలితాలు లభిస్తాయి. ఫ్యామిలీ సపోర్టు ఉంటుంది. ఈ సమయంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. 


సింహం (Leo)- వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. సమాజంలో  గౌరవం పెరుగుతుంది. ఆత్మవిశ్వాసంతో అన్ని పనులను పూర్తి చేస్తారు. ప్రభుత్వ అధికారుల సహకారం లభిస్తుంది.


కన్య (Virgo)- ఈ రాశివారి ఆదాయం పెరగవచ్చు. వ్యాపార రంగంలో రాణిస్తారు. తండ్రి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం మంచిది. విద్యా  సంబంధిత విషయాలు కలిసిరావచ్చు. 


తులారాశి (Libra)- ఈ రాశివారు భారీగా డబ్బు సంపాదిస్తారు. ఈ సమయంలో మనస్సులోకి నెగిటివ్ ఆలోచనలను రానీయకండి. ఫ్యామిలీ లైఫ్ అద్భుతంగా ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది. 


వృశ్చికం (Scorpio)- ఈ సమయం మీకు అంతగా కలిసిరాకపోవచ్చు. వ్యాపారపరమైన ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. తండ్రి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఈ సమయంలో స్వీయ నిగ్రహంతో ఉంటూ..భావోద్వేగాలను అదుపులో ఉంచుకోండి. 


ధనుస్సు (Sagittarius)- ఈ సమయంలో మీకు ఆహారం పట్ల ఆసక్తి పెరుగుతుంది. కోపాన్ని తగ్గించుకుంటే మంచిది. మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంది. కుటుంబంలో ఆనందం, శాంతి నెలకొంటుంది. 


మకరం (Capricorn)- మీరు మిత్రుల సపోర్టుతో ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. వాగ్వాదాలకు దూరంగా ఉండండి. ఈ సమయంలో సంయమనంతో వ్యవహారించండి. 


కుంభం (Aquarius)- కెరీర్ లో పురోగతి ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది. విద్యా సంబంధిత విషయాల్లో ఆశించిన ఫలితాలు లభిస్తాయి. 


మీనం (Pisces)- చదువుపై ఆసక్తి పెరుగుతుంది. కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది. వ్యాపారం విస్తరిస్తుంది. మీ డబ్బు ఎక్కడైనా ఇరుక్కుపోతే అది మీ వద్దకు చేరుతుంది. అనవసర ఖర్చులు పెరుగుతాయి.


Also Read: Budh Vakri 2022 Effect: తిరోగమన బుధుడి ఎఫెక్ట్.. సెప్టెంబర్ 10 నుండి ఈ రాశులవారికి గోల్డెన్ డేస్... 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook