Sun Transit 2022 : కన్యారాశిలో సూర్య సంచారం.. లక్కీ, అన్ లక్కీ రాశులివే..!
Sun Transit 2022: గ్రహాలకు రాజు సూర్యుడు. నిన్న సూర్యదేవుడు కన్యారాశిలోకి ప్రవేశించాడు. దీని ప్రభావం మెుత్తం 12 రాశులవారిపై ఎలా ఉంటుందో తెలుసుకుందాం.
Sun Transit 2022 effect: నిన్న అంటే సెప్టెంబరు 17న సూర్యభగవానుడు కన్యారాశిలోకి ప్రవేశించాడు. నెలరోజులపాటు అక్కడే ఉండనున్నాడు. ఇప్పటికే కన్యారాశిలో ఉన్న బుధుడితో బుధాదిత్య యోగాన్ని ఏర్పరచునున్నాడు. అయితే కన్యారాశిలో సూర్యుడి సంచారం (Sun Transit in Virgo 2022) ఏ రాశివారిపై ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం.
మెుత్తం రాశులపై సూర్య సంచార ప్రభావం
మేషరాశి (Aries): సూర్య సంచారం కారణంగా ఈ రాశివారికి కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. పిల్లలతో ఎక్కువ సమయం గడుపుతారు. ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి. ప్రేమ జీవితంలో చిన్న ఇబ్బందులు రావచ్చు.
వృషభరాశి (Taurus): సూర్య సంచారం కారణంగా ఈ రాశివారి వ్యాపారం వృద్ధి చెందుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. విద్యార్థులకు ఈ సమయం కలిసి వస్తుంది. ఆఫీసులో మీ ప్రాబల్యం పెరుగుతుంది. ఈ సమయంలో పెట్టుబడి పెడితే భవిష్యత్తులో మంచి లాభాలను ఆర్జించవచ్చు.
మిథునం (Gemini): ప్రభుత్వ రంగంలో పనిచేసే వారికి సూర్యుని ఈ సంచారం ప్రయోజనకరంగా ఉంటుంది. విద్యారంగంలో ఉన్నవారికి ఈ కాలం బాగుంటుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మరియు మీ పనితీరు మెరుగుపడుతుంది. ఏదైనా ఆస్తి కొనుగోలు చేసేటప్పుడు అనుభవజ్ఞులను సంప్రదించిన తర్వాతే నిర్ణయం తీసుకోండి.
కర్కాటక (Cancer): ఈరాశివారు అదనపు బాధ్యతలు తీసుకునే అవకాశం ఉంది. వైవాహిక జీవితం బాగుంటుంది. విద్యార్థులు చదువుపై ఆసక్తి కనబరుస్తారు. మీ పనికి ప్రశంసలు దక్కుతాయి.
సింహరాశి (Leo): సూర్యుని సంచారం సింహరాశి వారికి సంపదను పెంచుతుంది. ఇంట్లో పెద్దవారితో మాట్లాడేటప్పుడు ఓపికతో వ్యవహారించండి. తల్లిదండ్రుల ఆస్తుల నుంచి మీరు లాభం పొందే అవకాశం ఉంది.
కన్యారాశి (Virgo): సూర్యుడు కన్యారాశిలో సంచరించబోతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ రాశి వారికి విశ్వాసం పెరుగుతుంది. విద్యార్థులు ఈ సమయం కలిసి వస్తుంది. ఆరోగ్యం పరంగా చిన్న మార్పులు కనిపించవచ్చు.
తులారాశి (Libra): ఈ రాశివారు ఉద్యోగ రీత్యా ఇంటికి దూరంగా ఉండవలసి రావచ్చు. ఆరోగ్యంపై శ్రద్ద తీసుకోండి. ఈ సమయంలో మీ ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది. మీ శత్రువుల పట్ల అప్రమత్తంగా ఉండండి.
వృశ్చిక రాశి (Scorpio): కన్యారాశిలో సూర్యుని సంచారం వృశ్చిక రాశి వారికి లాభదాయకంగా ఉంటుంది, ఎందుకంటే సూర్యుడు మీ లాభ స్థానంలో ఉన్నాడు. మీరు కొత్త ఆదాయ వనరుల ద్వారా డబ్బును సంపాదిస్తారు. వీరు వ్యాపారంలో పెద్ద డీల్స్ ను కుదుర్చుకుంటారు.
ధనుస్సు రాశి (Sagittarius): సూర్యుడు ఈ రాశి యెుక్క తొమ్మిదవ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. అంటే అది ధనుస్సు రాశి వారికి భాగ్యస్థానం. సూర్యుని సంచారం ధనుస్సు రాశి వారికి ఉద్యోగ, వ్యాపార రంగాలలో అనుకూల ఫలితాలను ఇస్తుంది. మీకు ఫ్యామిలీ సపోర్టు లభిస్తుంది. ఈ సమయంలో మీకు ఆద్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరిగే అవకాశం ఉంది.
మకరరాశి (Capricorn): సూర్య సంచార కారణంగా మీ ప్రతిష్ట దెబ్బతినే అవకాశం ఉంది. అలాగే మీరు ఏదైనా సమస్యపై ఇతరులపై ఆధిపత్యం చెలాయించడం మానేయాలి. అలాగే, మీరు మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి మరియు మానసిక ఒత్తిడికి దూరంగా ఉండటానికి ప్రయత్నించాలి.
కుంభరాశి (Aquarius): కుంభ రాశి వారికి కొంచెం ఇబ్బందికరంగా ఉండవచ్చు. ఈ సమయంలో ఎవరితోనూ వాదించవద్దు. వీలైనంత ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి. ఆర్థికంగా సమస్యలు ఎదుర్కోనే అవకాశం ఉంది.
మీనరాశి (Pisces): ఈ సమయంలో పిల్లల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం అవసరం. ఈ సమయం మీకు అశుభకరమైనది. మీరు మీ పనిలో ఆశించిన ఫలితాలను పొందలేరు. ఆఫీసులో తోటివారితో వివాదం ఏర్పడే అవకాశం ఉంది.
Also Read: Budhaditya Raj Yog: కన్యారాశిలో బుధాదిత్య యోగం.. ప్రకాశించనున్న ఈ 4 రాశుల అదృష్టం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook