Sun Transit 2023: హిందూమతంలో సూర్యుడి రాశి పరివర్తనానికి అత్యంత కీలకమైన ప్రాధాన్యత ఉంది. ఎందుకంటే సూర్యుడిని గ్రహాల రారాజుగా పరిగణిస్తారు. సూర్యుడు ఎప్పుడు గోచారం చేసినా ఆ ప్రభావం అన్ని రాశులపై కచ్తితంగా పడుతుంటుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

హిందూమతం విశ్వాసాల ప్రకారం గ్రహాలు నిర్ణీత సమయం వచ్చేసరికి నిర్దేశిత రాశిలో ప్రవేశిస్తాయి. అదే విధంగా సెప్టెంబర్ 17న అంటే మరో మూడ్రోజుల్లో కన్యా రాశిలో ప్రవేశించనుండటం ప్రభావం వివిధ రాశులపై వేర్వేరుగా ఉంటుంది. సూర్యుడి కన్యారాశి గోచారంతో కన్యా రాశిపై అద్భుతమైన ప్రభావం ఉండనుంది. అప్పటి వరకూ సింహరాశిలో ఉండే సూర్యుడు సెప్టెంబర్ 17వ తేదీ మద్యాహ్నం నుంచి అక్టోబర్ 17 రాత్రి వరకూ దశ తిరగనుంది. కన్యా రాశిపై ఎలాంటి ప్రభావం ఉంటుందో తెలుసుకుందాం..


ఉద్యోగం మారాలనుకుంటే ఈ సమయం ఈ రాశివారికి అత్యంత అనుకూలమైన సమయం. ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే ఇదే మంచి సమయంగా భావించాలి. ఉన్నత పదవుల్లో ఉండేవారికి సరైన సమయం. శక్తి సామర్ధ్యాలు పెరుగుతాయి. ఈ సమయంలో ఎదురయ్యే వివిధ రకాల సమస్యల్ని ఎదుర్కొనేందుకు కావల్సిన మనోధైర్యం కలుగుతుంది. పనిచేసే చోట ఎదురయ్యే ఒత్తిళ్లు దూరమౌతాయి. 


వ్యాపారులకు ఇది చాలా మంచి సమయం. మానసికంగా శక్తివంతులుగా ఉంటారు. వ్యాపారులైతే మీరు తీసుకునే నిర్ణయాలతో అందరికీ ప్రయోజనం కలుగుతుంది. కొన్ని సందర్భాల్లో ఇబ్బందులు ఎదురైనా ఎదుర్కోగలరు. అంతా అనుకూలమైన పరిస్థితి ఉంటుంది. ఉన్నత చదువులు చదివేవారికి ప్రయోజనకరం. ధైర్యంతో ముందుకు నడవడం అలవర్చుకోవాలి. పోటీ పరీక్షల్లో విజయం సాధించగలరు. 


కుటుంబ వ్యవహారాల్లో ఎదురయ్యే సమస్యల్నించి దూరంగా ఉంటే మంచిది.. లేకపోతే సమస్యలు పెరిగి పెద్దదౌతాయి. ముఖ్యంగా భాగస్వామితో ఎదురయ్యే వివాదాలు మానుకోవాలి. పిల్లల సమస్యలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. కుటుంబంలో పెద్దల ఆరోగ్యం క్షీణించవచ్చు. అయితే అప్రమత్తంగా ఉంటే ఎలాంటి సమస్య ఉత్పన్నం కాదు. ఇంటి విషయాల్లో మహిళలు పలు సవాళ్లు ఎదుర్కోవల్సి వస్తుంది. 


Also read: Lucky Zodiac: 2024లో ఈ రాశుల వారికి లాటరీ తగలబోతుంది.. ఇందులో మీరున్నారా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook