Sun Transit: కుంభరాశిలోకి సూర్యుడి ప్రవేశం..ఈ 3 రాశుల వారి కోరికలు త్వరలోనే నెరవేరబోతున్నాయి!
Sun Transit Into Aquarius 2024 In Telugu: ఫిబ్రవరి 13వ తేదీన కుంభ రాశిలోకి సూర్యగ్రహం సంచారం చేయబోతోంది. దీని కారణంగా మూడు రాశుల వారికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర చెబుతున్నారు. ఏయే రాశుల వారికీ ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకోండి.
Sun Transit Into Aquarius 2024 In Telugu: సూర్య గ్రహానికి జ్యోతిష్య శాస్త్రంలో ఎనలేని ప్రాముఖ్యత ఉంది ఈ గ్రహాన్ని అన్ని గ్రహాలకు రారాజుగా పిలుస్తారు సూర్యుడు ప్రతినెల ఒక రాశి నుంచి మరొక రాశికి సంచారం చేస్తాడు అయితే ఈ సమయంలో సానుకూల ప్రభావంతో పాటు ప్రతికూల ప్రభావాలు ఏర్పడతాయని జ్యోతిష్యవాసుల నిపుణులు చెబుతున్నారు. ఫిబ్రవరి 13న సూర్యగ్రహం రాశి సంచారం చేయబోతోంది. ప్రస్తుతం మకర రాశిలో ఉన్న సూర్యుడు ఫిబ్రవరి 13న కుంభ రాశిలోకి సంచారం చేయబోతున్నాడు దీని కారణంగా కొన్ని రాశుల వారికి 30 రోజుల పాటు శుభప్రదంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అయితే సూర్య గ్రహ సంచారంతో ఏయే రాశుల వారికి ఎలా ఉండబోతుందో? ఇప్పుడు మనం తెలుసుకుందాం.
మిథున రాశి:
సూర్య గ్రహ సంచారం కారణంగా మిథున రాశి వారికి చాలా ప్రయోజనకరంగా ఉంది ఈ సమయంలో వీరు కష్టపడి పని చేయడం వల్ల కీర్తి ప్రతిష్టలు పొందడమే కాకుండా గొప్ప విజయాలు సాధిస్తారు. అంతే కాకుండా మతపరమైన కార్యక్రమాల పట్ల కూడా ఎంతో ఆసక్తి పెరుగుతుంది. దీంతోపాటు మీరు ఈ సమయంలో కుటుంబంతో సంతోషంగా గడుపుతారు సూర్య భగవానుడు అనుగ్రహం లభించి డబ్బును కూడా పొందుతారు.
సింహ రాశి:
సూర్య గ్రహ సంచారం సింహ రాశి వారికి కూడా ఎంతో లాభదాయకంగా ఉండబోతోంది. ఈ సమయంలో సింహరాశి వారికి నిలిచిపోయిన పనులన్నీ పూర్తవుతాయి. అంతేకాకుండా ఈ సమయంలో పూర్తి విశ్వాసంతో ఉండడం వల్ల ఎలాంటి పనులనైనా సులభంగా చేయగలుగుతారు. సూర్య గ్రహ సంచారంతో ఉద్యోగాల్లో కొత్త అవకాశాలు పొందుతారు అంతే కాకుండా ఆరోగ్యం కూడా ఇంతకుముందు ఉన్న దానికంటే మరింత మెరుగు పడుతుంది.
Also Read Hacking Accounts: తెలంగాణపై హ్యాకర్ల ముప్పేట దాడి.. గవర్నర్, మంత్రి, కవిత ఖాతాలను వదలని హ్యాకర్లు
కర్కాటక రాశి:
కర్కాటక రాశి వారికి సూర్య భగవానుడి అనుగ్రహం లభించి ఊహించని లాభాలు పొందుతారు. అంతేకాకుండా వీరు ఈ సమయంలో కొత్త భవనాలతో పాటు వాహనాలు కూడా కొనుగోలు చేసి ఇక ఎప్పటినుంచో వస్తున్న భూ వివాదాలు కూడా ఈ సమయంలో పరిష్కారమవుతాయి. ఆర్థిక పరిస్థితులు ఇంతకు ముందున్న వాటికంటే ఇప్పుడు మెరుగుపడతాయి.. అంతేకాకుండా జీవిత భాగస్వామి నుంచి పూర్తి సపోర్టు లభించి సంతోషంగా ఉంటారు.
Also Read Hacking Accounts: తెలంగాణపై హ్యాకర్ల ముప్పేట దాడి.. గవర్నర్, మంత్రి, కవిత ఖాతాలను వదలని హ్యాకర్లు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter