Trikon Rajyoga benefits: జ్యోతిష్య శాస్త్రంలో సూర్య భగవానుడిని గ్రహాల రాజుగా భావిస్తారు. ఇతడిని ఆత్మ, గౌరవం మరియు విజయానికి కారకుడిగా భావిస్తారు. ప్రస్తుతం ఆదిత్యుడు మేషరాశిలో సంచరిస్తున్నాడు. దీని కారణంగా కొందరి జాతకంలో త్రికోణ రాజయోగం ఏర్పడింది. దీని కారణంగా మూడు రాశులవారు మంచి బెనిఫిట్స్ పొందనున్నారు. ఆ అద్భుత రాశులేంటో తెలుసుకుందాం. 
మేష రాశి
సూర్యభగవానుని సంచారం మీకు కలిసి వస్తుంది. ఎందుకంటే భానుడు మీ జాతకంలో లగ్న గృహంలో కేంద్ర త్రికోణ రాజయోగాన్ని చేస్తున్నాడు. దీంతో మీ ఆర్థిక పరిస్థితి బలపడనుంది. అంతేకాకుండా మీ వ్యక్తిత్వం మెరుగుపడుతుంద. మీకు ప్రమోషన్ లభిస్తుంది. మీ లైఫ్ పార్టనర్ సపోర్టు మీకు లభిస్తుంది. మీరు కెరీర్ లో పురోగతి సాధించే అవకాశం ఉంది. పెళ్లి ఫిక్స్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సింహ రాశి
సూర్య భగవానుడి రాశి మార్పు మీకు శుభప్రదంగా ఉంటుంది. ఎందుకంటే సూర్యదేవుడు మీ సంచార జాతకంలో తొమ్మిదవ ఇంటిలో కేంద్ర త్రికోణ రాజయోగాన్ని చేస్తున్నాడు. దీంతో మీకు ప్రతి పనిలో అదృష్టం కలిసి వచ్చి దానిని విజయవంతంగా పూర్తిచేస్తారు. పోటీపరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు విజయం సాధిస్తారు. మీరు పని లేదా వ్యాపార నిమిత్తం ప్రయాణం చేసే అవకాశం ఉంది. మీ ఇంట్లో శుభకార్యం జరిగే అవకాశం ఉంది. 


ధనుస్సు రాశి
కేంద్ర త్రికోణ రాజయోగం ధనుస్సు రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే మీ సంచార జాతకంలో ఐదవ ఇంట్లో ఈ యోగం ఏర్పడుతోంది. దీంతో మీకు సంతానప్రాప్తి కలుగుతుంది. మీరు స్టాక్ మార్కెట్, బెట్టింగ్ మరియు లాటరీలో డబ్బు పెట్టుబడి పెట్టడం ద్వారా ప్రయోజనం పొందుతారు. మీరు కెరీర్ లో పురోగతి సాధిస్తారు. ఏదైనా ఉన్నత విద్యా సంస్థలో ఆడ్మిషన్ దొరికే అవకాశం ఉంది.


Also read: Daridra Yog effect: 'దారిద్య్ర యోగం' చేయబోతున్న కుజుడు... ఈ 3 రాశులకు కష్టాలు షురూ..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook