Surya Rashi Parivartan 2023: గ్రహాల రాజు అయిన సూర్యుడు ప్రతి నెలా ఏదో ఒక రాశిలో సంచరిస్తాడు. ప్రస్తుతం మీన రాశిలో సంచరిస్తున్న సూర్యదేవుడు ఏప్రిల్ లో తన రాశిని మార్చనున్నాడు. ఏప్రిల్ 14వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం 02:42 గంటలకు భానుడు మీనరాశిని విడిచిపెట్టి మేష రాశిలోకి ప్రయాణిస్తాడు. ఆదిత్యుడి యెుక్క ఈరాశి మార్పు కారణంగా కొందరి జీవితాల్లో పెను మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఆ రాశులేంటో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సూర్య గోచారం ఈ రాశులకు అదృష్టం
1. మేషం
సూర్యుడి గోచారం వల్ల మేషరాశి వారికి బాధ్యతలు పెరుగతాయి. కెరీర్ అద్భుతంగా ఉండబోతుంది. వీరు అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు. వ్యాపారులు లాభపడతారు. ఆర్థిక స్థితి గతం కంటే మెరుగుపడుతుంది.
2. మిథునం
మిథునరాశి వారికి సూర్య సంచారం శుభ ఫలితాలను అందించింది. మీరు అన్ని రంగాలలో విజయం సాధించే అవకాశం ఉంది. మీ శ్రమకు తగిన ఫలితాలు పొందుతారు. బిజినెస్ చేసేవారు భారీ లాభాలను పొందుతారు. విదేశాలకు వెళ్లే  అవకాశం ఉంది. లవ్ లైవ్ బాగుంటుంది. 
3. కర్కాటకం
కర్కాటక రాశి వారికి ఈ సంచారం చాలా అద్భుతంగా ఉండబోతుంది. మీరు ఆర్థిక ప్రయోజనం పొందుతారు. ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగంలో ప్రమోషన్ కు అవకాశం ఉంది. మీరు కొత్త అవకాశాలను అందిపుచ్చుకుంటారు. మీకు ప్రతి పనిలోనూ అదృష్టం కలిసి వస్తుంది. 
4. సింహం
సూర్య సంచారం సింహ రాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. విదేశాలకు వెళ్లే అవకాశం ఉంటుంది. కెరీర్ లో పురోగతి ఉంటుంది. ఉద్యోగులకు పదోన్నతి లభిస్తుంది. వైవాహిక జీవితం బాగుంటుంది. 
5. వృశ్చికం
వృశ్చిక రాశి వారికి సూర్య గోచారం లాభాలను ఇస్తుంది. మీ పనికి ప్రశంసలు దక్కుతాయి. మీరు రుణ విముక్తి పొందుతారు. ఆరోగ్యం బాగుంటుంది. మీలో ధైర్యం పెరుగుతుంది.
6. ధనుస్సు
ధనుస్సు రాశి వారు కెరీర్‌లో కొత్త అవకాశాలు అందిపుచ్చుకుంటారు. సూర్యుడి రవాణా మీకు మేలు చేస్తుంది. వ్యాపారులు భారీగా లాభపడతారు. మీరు శత్రువులపై విజయం సాధిస్తారు.  


Also Read: Budh Shukra yuti 2023: మేషంలో మూడు గ్రహాల గొప్ప కలయిక.. ఈరాశులకు తిప్పలు తప్పవు ఇక..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి