Today Gold And Silver Rates: పసిడి ధరలు ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాయి. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా బంగారం ధర తొలిసారిగా 78000 రూపాయల మార్కును దాటింది. పసిడి ధరలు ఈ రేంజ్ లో పెరగడం ఇదే తొలిసారి అని నిపుణులు సైతం వాపోతున్నారు. నేడు సెప్టెంబర్ 30 సోమవారం మాత్రం పసిడి ధరలు స్వల్పంగా తగ్గాయి.
నిన్నటితో పోల్చి చూస్తే బంగారం ధర 60 రూపాయలు తగ్గింది దీంతో తాజా ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 77,940 రూపాయలుగా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 70,950 రూపాయలుగా ఉంది. బంగారం ధర భవిష్యత్తులో మరింత పెరిగే అవకాశం ఉందని కూడా నిపుణులు అంచనా వేస్తున్నారు.
బంగారం ధరలు పెరగడం వెనుక ప్రధానంగా అంతర్జాతీయంగా ఉన్న పరిస్థితులే కారణమని చెప్తున్నారు. పశ్చిమాసియా దేశాల్లో యుద్ధ వాతావరణం నెలకొని ఉన్న నేపథ్యంలో బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్ ఊగిసలాటకు గురయ్యే అవకాశం ఉంది. దీనికి తోడు అమెరికా అధ్యక్ష ఎన్నికలు సైతం స్టాక్ మార్కెట్ను ప్రభావితం చేస్తాయి.
ఈ నేపథ్యంలో బంగారంలో పెట్టుబడి పెట్టేందుకు ఇన్వెస్టర్లు ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు. దీంతో పసిడి ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెప్తున్నారు. బంగారం ధరలు పెరగడం వెనుక మరో ప్రధాన కారణం ఇటీవలే అమెరికా ఫెడరల్ రిజర్వ్ కీలక వడ్డీ రేట్లు తగ్గించడం కూడా ఒక కారణంగా చెప్తున్నారు. వడ్డీరేట్ల తగ్గింపు ద్వారా బంగారం ధరలు పెరిగే అవకాశం ఉందని ముందు నుంచే అంచనాలు వచ్చాయి.
అందుకు తగ్గట్టుగానే పసిడి ధరలు భారీగా పెరిగాయి. ప్రస్తుతం బంగారం ధరలు ఎంతవరకు పెరగవచ్చు అని అంచనాలు వెలువడుతున్నాయి. ముఖ్యంగా దేశీయంగా చూస్తే దసరా దీపావళి ధన త్రయోదశి సందర్భంగా పెద్ద ఎత్తున బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. దీంతో దేశీయంగా కూడా పెద్ద ఎత్తున డిమాండ్ ఏర్పడే అవకాశం ఉంది. మరో వారం రోజుల్లో బంగారం ధర రూ. 80,000 తాకే అవకాశం ఉందని ఇప్పటికే నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఇక బంగారం ధర ఈ ఏడాది చివరి నాటికి రూ. 90 వేల నుంచి రూ.1 లక్ష మధ్యలో ట్రేడ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. పెరుగుతున్న బంగారం పై మీరు లాభాలు పొందాలి అనుకున్నట్లయితే, ఫిజికల్ గోల్డ్ కు బదులుగా భారత ప్రభుత్వం జారీ చేసే సావరిన్ గోల్డ్ బాండ్లలో పెట్టుబడి పెట్టడం తెలివైన నిర్ణయం అని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే వీటిపై ఎలాంటి మేకింగ్ చార్జీలు జీఎస్టీ వంటివి ఉండవు. పైగా మీకు బంగారం బాండ్లపై వడ్డీ కూడా లభిస్తుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.