Grah yuti 2023: ఒకే రాశిలో నాలుగు పెద్ద గ్రహాలు... ఈ 4 రాశులకు డబ్బే డబ్బు..
Grah yuti 2023: ఏప్రిల్ 22న బృహస్పతి మేష రాశిలోకి ప్రవేశించాడు. ఇప్పటికే అదే రాశిలో సూర్యుడు, బుధుడు మరియు రాహువు సంచరిస్తున్నారు. ఈ నాలుగు గ్రహాల కలయిక కొన్ని రాశులవారికి కలిసి రానుంది. ఆ రాశులేంటో తెలుసుకుందాం.
Planet Conjunction 2023: గ్రహాల సంచారం పరంగా ఏప్రిల్ నెల చాలా ముఖ్యమైనది. రీసెంట్ గా ఒకే రాశిలో నాలుగు గ్రహాల కలయిక ఏర్పడింది. మేషరాశిలో సూర్యుడు, బుధుడు, గురుడు మరియు రాహువుల సంయోగం సంభవించింది. ఇది ఏయే రాశులవారికి శుభప్రదంగా ఉంటుందో తెలుసుకుందాం.
మేషరాశి
ఇదే రాశిలో నాలుగు గ్రహాలు కలిసి ఉంటాయి. దీని కారణంగా మీ వ్యాపారం వృద్ధి చెందుతుంది. మీ ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. ఆదాయం డబల్ అవుతుంది. మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. మెుత్తానికి ఈ సమయం మీకు అనుకూలంగా ఉంటుంది.
ధనుస్సు రాశి
ఫ్లానెట్స్ మీటింగ్ వల్ల ధనుస్సు రాశి వారి జీవితంలో అనుకూలమైన ఫలితాలను పొందుతారు. దీని కారణంగా మీరు మానసిక ప్రశాంతతను పొందుతారు. వ్యాపారం మెరుగుపడుతుంది. విద్యార్థులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. మీ దాంపత్య జీవితం బాగుంటుంది.
Also Read: Guru Gochar 2023: 12 ఏళ్ల తర్వాత మేషరాశిలోకి బృహస్పతి.. ఈ 5 రాశులను వరించనున్న అదృష్టం, ఐశ్వర్యం!
వృషభం
నాలుగు గ్రహాల కలయిక వల్ల వృషభ రాశి వారు మంచి ఫలితాలను పొందుతారు. మీ వ్యాపారంలో భారీగా లాభాలను ఆర్జిస్తారు. కుటుంబంలో ఆనందం వెల్లివిరిస్తుంది. తోబుట్టువుల సహకారంతో మీ బిజినెస్ విస్తరిస్తుంది. పఠనాసక్తిని పెంచుకోవడం వల్ల మీరు ప్రయోజనం పొందుతారు.
మిధునరాశి
గ్రహాల సంయోగం వల్ల మిథునరాశి వారికి మేలు జరుగుతుంది. మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఉద్యోగం మారాలనుకునే వారికి ఇదే మంచి సమయం. మీకు ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఫ్యామిలీ సపోర్టుతో మీరు జీవితంలో ముందుకు వెళతారు. మీ ఆదాయం రెట్టింపు అవుతుంది.
Also Read: Shani Vakri 2023: కుంభరాశిలో రివర్స్‌లో కదలనున్న శని.. ఈ 5 రాశులకు అన్నీ సమస్యలే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook