Budhaditya Rajyog: మీనరాశిలో బుధాదిత్య రాజయోగం.. ఈరాశులకు మంచి రోజులు మెుదలు..
Budhaditya Rajyog: వేద జ్యోతిష్యం ప్రకారం, మీన రాశిలో బుధాదిత్య రాజయోగం ఏర్పడబోతోంది. దీని వల్ల 3 రాశుల వారికి మంచి రోజులు మొదలవుతాయి.
Budhaditya Rajyog effect: ప్రతి ఫ్లానెట్ కొంత సమయం తర్వాత తన రాశిని మారుస్తుంది. సూర్యుడు మరియు బుధుడు కలయిక వల్ల మార్చి 16న మీనరాశిలో బుధాదిత్య రాజయోగం ఏర్పడుతుంది. దీని ప్రభావం ప్రజలందరిపై కనిపిస్తుంది. ఈ రాజయోగం మూడు రాశులవారు అంతులేని సంపదను పొందనున్నారు. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
బుధాదిత్య రాజయోగం ఈ రాశులకు శుభప్రదం
వృషభ రాశి
బుధాదిత్య రాజయోగం ఏర్పడటం వృషభ రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. ఎందుకంటే మీ రాశి నుండి ఆదాయ గృహంలో ఈ యోగం ఏర్పడబోతోంది. దీంతో మీ ఆదాయంలో విపరీతమైన పెరుగుదల రాబోతుంది. మీరు పాతపెట్టుబడుల నుండి ప్రయోజనం పొందుతారు. మీరు వ్యాపారంలో డబ్బును పెట్టుబడి పెట్టడం లాభదాయకంగా ఉంటుంది. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. దంపతులకు సంతానప్రాప్తి కలుగుతుంది.
మిథున రాశిచక్రం
బుధాదిత్య రాజయోగం ఏర్పడటం మీకు శుభప్రదంగా ఉంటుంది. ఎందుకంటే ఈ యోగం మీ సంచార జాతకానికి సంబంధించిన కర్మ భావంపై ఏర్పడుతుంది. రాజకీయాల్లో ఉన్నవారికి పదవి దక్కుతుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్ దక్కే అవకాశం ఉంది. బిజినెస్ చేసే వారు మంచి లాభాలు గడిస్తారు. మీరు వ్యాపారాన్ని విస్తరించే అవకాశం ఉంది.
కర్కాటక రాశిచక్రం
బుధాదిత్య రాజయోగం ఏర్పడటంతో కర్కాటక రాశి వారికి మంచి రోజులు మొదలవుతాయి. ఎందుకంటే మీ రాశి యెుక్క అదృష్ట స్థానంలో ఈ యోగం ఏర్పడబోతోంది. అందుకే ఈ సమయంలో అదృష్టం మీ వెంటే ఉంటుంది. మీరు మీ పనుల్లో విజయం సాధిస్తారు. పోటీపరీక్షలకు ప్రిపేర్ అయ్యేవారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. కుటుంబంలో సంతోషం నెలకొంటుంది.
Also Read: Shani Gochar 2023: శతభిషా నక్షత్రంలోకి శని... రాబోయే 7 నెలలు పాటు ఈరాశులకు మనీ మనీ మోర్ మనీ..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook