Shani Gochar 2023: శతభిషా నక్షత్రంలోకి శని... రాబోయే 7 నెలలు పాటు ఈరాశులకు మనీ మనీ మోర్ మనీ..

Shani Gochar 2023: గ్రహాల రాశి మార్పు ప్రజల జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. మార్చి 15 నుంచి అక్టోబర్ 17 వరకు శనిగ్రహం శతభిషా నక్షత్రంలో సంచరించనుంది. ఈ సమయంలో కొన్ని రాశులవారు మంచి ప్రయోజనాలు పొందనున్నారు.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Mar 6, 2023, 01:42 PM IST
Shani Gochar 2023: శతభిషా నక్షత్రంలోకి శని... రాబోయే 7 నెలలు పాటు ఈరాశులకు మనీ మనీ మోర్ మనీ..

Saturn Transit 2023 Effect:  జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, శనిదేవుడిని న్యాయ దేవుడు మరియు కర్మ దాత అని పిలుస్తారు. మనం చేసే మంచి చెడులను బట్టి ఫలితాలను ఇచ్చేవాడు శనిదేవుడు. మార్చి 15న శనిదేవుడు శతభిషా నక్షత్రంలోకి ప్రవేశించనున్నాడు. ప్రస్తుతం శని కుంభరాశిలో ట్రావెల్ చేస్తున్నాడు. అక్టోబరు 17 వరకు కుంభరాశిలోనే శనిదేవుడు ఉంటాడు. శతభిషా నక్షత్రంలో శనిదేవుడు ప్రవేశించిన వెంటనే కొన్ని రాశులవారికి మంచి రోజులు ప్రారంభమవుతాయి. 

శని సంచారం ఈ రాశులకు వరం
మేషరాశి
శని శతభిషా నక్షత్రంలో ప్రవేశించినప్పుడు మేషరాశి వారు శుభ ఫలితాలు పొందుతారు. వీరు బిజినెస్ స్టార్ట్ చేస్తారు. వ్యాపారంలో భారీగా లాభం ఉంటుంది. కెరీర్ లో ముందుకు సాగుతారు. పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. మెుత్తానికి ఈ సమయం మీకు అద్భుతంగా ఉంటుంది. 
మిధునరాశి
శని సంచారం వల్ల మిథున రాశి వారు మంచి లాభాలను గడిస్తారు. మీ తొమ్మిదవ ఇంట్లో శనిదేవుడు సంచరిస్తాడు. మిథునరాశి వారికి ప్రయాణాలు అనుకూలిస్తాయి.  మీరు విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. మీ ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. నిలిచిపోయిన పనులన్నీ పూర్తవుతాయి. 
సింహరాశి 
శతభిషా నక్షత్రంలో శని సంచారం సింహ రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. కార్పొరేట్ రంగంలో ఉన్నవారు విజయం సాధిస్తారు. మీరు నచ్చిన చోటుకి ట్రాన్సఫర్ అయ్యే అవకాశం ఉంది. ఉద్యోగస్తులు సానుకూల ఫలితాలు పొందుతారు. మెుత్తానికి శని రాశి మార్పు మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. 
తులారాశి
శని సంచారం తులరాశివారికి శుభప్రదంగా ఉండనుంది. మీరు కెరీర్‌లో శుభ ఫలితాలు పొందుతారు. మీరు ఆర్థికంగా లాభపడతారు. అయితే విద్యార్థులు ఈసమయంలో కష్టపడి చదివితేనే మంచి ఫలితాలు సాధిస్తారు. ఉద్యోగ, వ్యాపారులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. 

Also Read: Mangal Gochar 2023: మరో వారంలో మిథునంలోకి కుజుడు.. దశ తిరగనున్న రాశులివే..! 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News