Surya Chandra Yuti 2023: త్వరలో వృషభ రాశిలో అశుభకరమైన `అమావాస్య దోషం`... ఈ 3 రాశుల వారు జాగ్రత్త..
Surya Chandra Yuti 2023: మరో పది రోజుల్లో వృషభరాశిలో సూర్య-చంద్రుల కలయిక వల్ల అశుభకరమైన యోగం ఏర్పడుతుంది. ఇది మూడు రాశులవారికి సమస్యలను సృష్టిస్తుంది.
Amavasya Dosh in Vrisabha 2023: ప్రతి గ్రహం పర్టికలర్ టైం తర్వాత తన రాశిని ఛేంజ్ చేస్తోంది. గ్రహాల రాజు అయిన సూర్యుడు మే 15న వృషభరాశిలోకి ప్రవేశించనున్నాడు. నాలుగు రోజుల తర్వాత చంద్రుడు కూడా అదే రాశిలోకి ప్రవేశిస్తాడు. శుక్రుడి రాశి అయిన వృషభరాశిలో సూర్యుడు మరియు చంద్రుల కలయిక ఏర్పడనుంది. వీరిద్దరి సంయోగం వల్ల అమావాస్య దోషం అని పిలువబడే ఒక అశుభకరమైన యోగం ఏర్పడుతుంది. మే 19న ఏర్పడబోతున్న ఈ అమావాస్య దోషం మూడు రోజులపాటు ఉంటుంది. ఇది కొన్ని రాశులవారిని ఇబ్బంది పెట్టనుంది. ఆ దురదృష్ట రాశులేంటో తెలుసుకుందాం.
వృషభం: ఇదే రాశిలో సూర్యచంద్రుల కలయిక వల్ల అమావాస్య దోషం ఏర్పడుతుంది. ఈ అశుభకరమైన యోగం వృషభరాశి వారిని ఇబ్బందులకు గురిచేయనుంది. పనిలో ఆటంకాలు ఏర్పడతాయి. మీరు కెరీర్ లో అనేక అడ్డంకులను ఎదుర్కోవల్సి ఉంటుంది. ఈ సమయంలో ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోండి.
తుల: సూర్యచంద్రుల కలయిక వల్ల ఏర్పడిన అమావాస్య దోషం తులారాశి వారికి సమస్యలను సృష్టిస్తుంది. మీరు అనారోగ్యం బారిన పడే అవకాశం ఉంది. మీరు చర్మ సంబంధిత వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది. శత్రువులు మీకు హాని కలిగించడానికి ప్రయత్నించవచ్చు, కాబట్టి జాగ్రత్తగా ఉండండి.
వృశ్చిక రాశి: అమావాస్య దోషం వృశ్చిక రాశి వారికి కూడా హాని కలిగిస్తుంది. దీని కారణంగా మీ దాంపత్య జీవితంలో సమస్యలు రావచ్చు. లైఫ్ పార్టనర్ తో విభేదాలు తలెత్తుతాయి. పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి. ఈ సమయంలో మీరు మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది. భారీగా డబ్బు నష్టపోయే అవకాశం ఉంది.
Also Read: Shukra Mahadasha: మీ జాతకంలో శుక్ర మహాదశ ఉందా? అయితే 20 ఏళ్లుపాటు మీరే కింగ్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook