Shukra Mahadasha effect: జాతకంలోని గ్రహాల స్థానాలను బట్టి భవిష్యత్తు గురించి చెబుతారు జ్యోతిష్యులు. నవగ్రహాల్లో శుక్రుడికి ప్రత్యేక స్థానం ఉంది. ఇతడిని లవ్, రొమాన్స్, లగ్జరీ లైఫ్ మరియు ఐశ్వర్యానికి కారకుడిగా భావిస్తారు. అంతేకాకుండా ఇతడిని ఆస్ట్రాలజీలో శుభగ్రహంగా భావిస్తారు. సాధారణంగా శుక్ర మహాదశ 20 సంవత్సరాలు ఉంటుంది.
శుక్ర మహాదశ ప్రభావం
ఎవరి జాతకంలో శుక్రుడు బలమైన స్థానంలో ఉంటాడో వారు 20 సంవత్సరాలు తిరుగు చూసుకోవల్సిన అవసరం లేదు. వీరికి దేనీకీ లోటు ఉండదు. సుఖసంతోషాలు, అష్టఐశ్వర్యాలతో తులతూగుతూ ఉంటారు. కుండలిలో శుక్రుడు బలహీన స్థానంలో ఉంటే వారు రెండు దశాబ్దాలు పాటు చాలా కష్టాలను ఎదుర్కోంటారు. మీరు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోంటారు. మీరు లవ్ లో ఫెయిల్ అవుతారు. దాంపత్య జీవితంలో విబేదాలు తలెత్తుతాయి.
పరిహారం
మహాదశలో శుక్రుడు క్షీణించినట్లయితే 'శున్ శుక్రాయ నమః' మంత్రాన్ని రోజూ 108 సార్లు జపించాలి. శుక్రవారం ఉపవాసం పాటించి లక్ష్మీదేవిని పూజించండి. అంతేకాకుండా అమ్మాయిలకు ఖీర్ ప్రసాదం తినిపించండి. పాలు, పెరుగు, నెయ్యి, కర్పూరం, తెల్లని పువ్వులు వంటి తెల్లని వస్తువులను అవసరమైన వారికి లేదా బ్రాహ్మణులకు దానం చేయండి. ఇలా చేయడం వల్ల శుక్రుడు నీచంగా ఉన్నా అనుకూల ఫలితాలను ఇస్తాడు. ఇదే సమయంలో జాతకంలో శుక్ర దోషం నుండి విముక్తి ఉంటుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook